పపువా న్యూ గినియా దేశంలో భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై 7.2గా తీవ్రత నమోదైనట్టు అమెరికా జియోలాజిక్ సర్వే(యూఎస్జీఎస్) ప్రకటించింది.
127 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. దేశంలోని బులోలో నగరానికి దాదాపు 33 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించింది యూఎస్జీఎస్. పపువా రాజధాని పోర్ట్ మోర్బీలోనూ భూ ప్రకంపనలు వచ్చినట్టు తెలిపింది.
ఇంతవరకు సునామీ హెచ్చరికలు అయితే జారీ కాలేదు. పపువా న్యూ గినియాలో సోమవారమే 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. మళ్లీ 24 గంటలు గడవకముందే భారీ తీవ్రతతో భూకంపం వచ్చింది.
గతేడాది..
గతేడాది ఫిబ్రవరిలో పపువా న్యూ గినియాలో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ ప్రకృతి వైపరీత్యంలో దాదాపు 125 మంది చనిపోయారు.