ETV Bharat / international

జైళ్లలో ఘర్షణ- 62 మంది మృతి

ఈక్వెడార్​ జైళ్లలో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో 62 మంది మృతిచెందారు. ఆధిపత్యం కోసం రెండు వర్గాల మధ్య ఈ వివాదం చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు.

62 inmates dead in ecuador prison riots
ఈక్వెడార్​ జైళ్లలో ఘర్షణ-62 మంది మృతి
author img

By

Published : Feb 24, 2021, 10:18 AM IST

ఈక్వెడార్​లోని జైళ్లలో ఖైదీల మధ్య చెలరేగిన అల్లర్లలో 62 మంది మృతిచెందారు. మరికొంతమందికి తీవ్రంగా గాయాలైనట్లు అక్కడి అధికారులు చెప్పారు. మెుత్తం మూడు జైళ్లల్లో హింసాకాండ చెలరేగగా... దక్షిణా క్యుంకాలోని జైలులో 33మంది, గుయాక్విల్ జైలులో 21మంది, లాటాకుంగాలోని జైలులో 8మంది చనిపోయినట్లు జైళ్ల నిర్వహణ సంస్థ డైరెక్టర్ వెల్లడించారు.

సోమవారం ఖైదీల మధ్య ఘర్షణ తలెత్తగా వారిని అదుపు చేసే క్రమంలో పలువురు పోలీసులు సైతం గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఘర్షణలను చల్లార్చేందుకు జైళ్లల్లో భారీగా బలగాలను మోహరించినట్లు చెప్పారు. జైళ్లల్లో ఆధిపత్యం కోసం... రెండు గ్రూపుల మధ్య వివాదం చెలరేగి అది కాస్త పరస్పర దాడులకు దారి తీసినట్లు జైలు అధికారులు చెప్పారు.

ఇదీ చదవండి:'ఆ మాట అన్నందుకు అతని ముక్కు విరగ్గొట్టాను'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.