అమెరికాలో భూకంపం సంభవించింది. శాన్ జువాన్లోని ప్యూర్టో రికో ప్రాంతంలో ఈ భూప్రకంపనలు కనిపించాయి. రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదైన ఈ భూకంప తీవ్రతకు పలు భవనాలు ధ్వంసమయ్యాయి. అమెరికాలో ఇటీవల కాలంలో సంభవించిన అతిపెద్ద భూకంపాల్లో ఇది ఒకటని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు.
మంగళవారం ఉదయం 4.24 గంటలకు ద్వీపం దక్షిణ ప్రాంతంలో 10 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైనట్లు అమెరికా జియెలాజికల్ సర్వే స్పష్టం చేసింది. ఆరంభంలో రిక్టర్ స్కేల్ మీద 6.6 గా నమోదైంది. తర్వాత 5.6 నుంచి 4.5 తీవ్రతతో ప్రకంపనలు ఏర్పడినట్లు పేర్కొంది.
ఈ భూకంపం ధాటికి పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. రహదారుల మధ్య బీటలు ఏర్పడ్డాయి. ప్రాంత ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. విద్యుత్తును పునరుద్ధరించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:హిమపాతంతో భూతల స్వర్గాన్ని తలపిస్తున్న ఉత్తరాఖండ్