చిలీ, ఉత్తర అర్జెంటీనా సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది. సోమవారం రాత్రి ఏర్పడిన ఈ భూకంపం ధాటికి ప్రజలు వణికిపోయారు. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదైంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
అర్జెంటీనాలోని పోర్సిటో పట్టణానికి నైరుతి దిక్కున 27.6 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించగా.. భయాందోళనకు గురైన ప్రజలు బయటకు పరుగులు తీశారు.
ఇదీ చదవండి : శ్వేతసౌధంలో భారతీయం- అగ్రరాజ్యంలో కీలకం