5G Services In USA: అమెరికాలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. ఏటీ అండ్ టీ, వెరైజన్ టెలికాం సంస్థలు 5జీ సేవలను ప్రారంభించాయి. విమానాలకు అంతరాయం లేకుండా ఈ సేవలను ప్రారంభించారు. విమానయాన సంస్థల అభ్యంతరాలతో అమెరికాలోని కొన్ని ఎయిర్‌పోర్టుల చుట్టూ 5జీ సర్వీసుల ప్రారంభాన్ని ఏటీ అండ్ టీ, వెరిజాన్ టెలికాం సంస్థలు తాత్కాలికంగా నిలిపేశాయి. మిగిలిన చోట్ల సేవల్ని ప్రారంభించినట్లు ఆ సంస్థలు వెల్లడించాయి.
అమెరికాలో బుధవారం నుంచి 5జీ సేవలు ప్రారంభించనున్నట్లు తెలియడంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన విమానయాన సంస్థలు అమెరికాకు వెళ్లాల్సిన విమానాలను రీషెడ్యూల్ చేశాయి.
ఎయిరిండియా సైతం అమెరికాకు వెళ్లాల్సిన కొన్ని విమానాలను నడపలేకపోతున్నామని ట్విటర్ వేదికగా ప్రకటించింది. 3.7- 3.98 గిగాహెర్ట్జ్ ఫ్రీకెన్సీ బ్యాండ్లలో 5జీ సేవల నిర్వహణకు గతేడాది ఫిబ్రవరిలో వెరైజన్, ఏటీ అండ్ టీ రూ.లక్షల కోట్ల విలువైన ఆర్డరు దక్కించుకున్నాయి.
అమెరికాలో 5జీ సేవలు 2021 డిసెంబరు 5 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా సాధ్యపడలేదు.
ఇదీ చూడండి: విమానాలకు '5జీ' బ్రేకులు.. భారతీయుల తీవ్ర ఇబ్బందులు