కొలంబియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత రెండు వారాలుగా జరుగుతున్న నిరసనల్లో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు 42 మంది ప్రాణాలు కోల్పోయారని మానవ హక్కుల శాఖ మంగళవారం వెల్లడించింది. నిరసనకారుల్లో 168 మంది ఆచూకీ గల్లంతైందని పేర్కొంది.
ప్రభుత్వం పన్ను పెంచడాన్ని నిరసిస్తూ ప్రజలు గత నెల 28 నుంచి ఆందోళనల్లో పాల్గొన్నారు. నిరసనలకు స్పందించిన ప్రభుత్వం.. ప్రతిపాదించిన 6.7 బిలియన్ డాలర్ల ప్రణాళికను మే2న ఉపసంహరించుకుంది. కానీ నిరసనకారులు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. పోలీస్ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఉచిత విద్య అందించాలని, కోటి మందికి కనీస వేతన పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటివరకు పలు మార్లు ప్రభుత్వంతో నిరసనకారులు చర్చలు జరిపినా.. సానుకూల ఫలితాలు అందలేదని సమాచారం.
ఇదీ చదవండి : తప్పుడు లెక్కే భారత్ కొంప ముంచింది: ఫౌచీ