అమెరికా దక్షిణ డకోటా రాష్ట్రంలో మూడు వేర్వేరు కొండప్రాంతాల్లో కార్చిచ్చు రేగింది. మంటలు రాపిడ్ నగరంవైపు దూసుకొస్తున్నందువల్ల 400పైగా ఇళ్లను ఖాళీ చేయించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. మౌంట్ రష్మోర్ ప్రాంతాన్ని మూసివేశామని వెల్లడించారు.
రాపిడ్ నగరానికి 24కి.మీ. దూరంలో నెమో ప్రాంతానికి సమీపంలో మొదట మంటలు వ్యాపించి నగరం వైపు విస్తరించాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ హాని కలగలేదని స్పష్టంచేశారు.
రాపిడ్ నగరంలోని కీస్టోన్లో మరో రెండు చోట్ల మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. మంటల్ని ఆర్పడానికి 250 అగ్నిమాపక యాంత్రాల్ని తరలించామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: టీకాలు సమకూర్చలేక బ్రెజిల్ మంత్రి రాజీనామా!