అమెరికా ఆరోరాలోని ఓ హైస్కూల్ వద్ద కాల్పులు ఘటన(us shooting news) కలకలం రేపింది. డెన్వర్ సబ్అర్బన్ ప్రాంతంలోని ఉన్నత పాఠశాల పార్కింగ్ స్థలంలో దుండగులు ముగ్గురు విద్యార్థులపై తుపాకులతో దాడి చేశారు(aurora shooting). గాయపడ్డ వీరిని ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం మధ్యహ్నం 12:30గం. సమయంలో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రుల్లో ఇద్దరిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. మరొకరు మాత్రం స్వతహాగా హాస్పిటల్కు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం ఆరోరాలోని మరో హైస్కూల్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటనలో(aurora shooting 2021) ఆరుగురు గాయపడ్డారు. వారం రోజుల్లో రెండుసార్లు ఇలాంటి దాడులు జరగడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శుక్రవారం ఘటన అనంతరం పాఠశాలను(aurora school shooting) లాక్ చేశారు పోలీసులు. విద్యార్థులను ఇళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు రావాలని ఫోన్ చేశారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత విడతల వారీగా అందరికీ ఇళ్లకు చేర్చారు.
వరస కాల్పుల ఘటనలు(us gun violence) జరుగుతున్న తరుణంలో యువత హింసకు పాల్పకుండా నియంత్రించాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సోమవారం జరిగిన ఘటనలో(aurora shooting news) గాయపడ్డవారిలో నలుగురు కోలుకున్నారు. మరో ఇద్దరు మాత్రం తీవ్ర గాయాల కారణంగా ఇంకా చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు పోలీసులు ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు. నిందితులు ఉపయోగించిన రెండు కార్ల ఆచూకీ మాత్రం గుర్తించినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: Farm laws repeal: సాగు చట్టాల రద్దును స్వాగతించిన అమెరికా!