అమెరికాలో అత్యంత భద్రత గల శ్వేతసౌధాన్ని సైతం కరోనా కలవరపెడుతోంది. తమతో కలిసి పనిచేసిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు తెలిశాక వైరస్ టాస్క్ ఫోర్స్‌లోని ముగ్గురు అధికారులు స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. వీరిలో అమెరికా జాతీయ అంటువ్యాధుల నియంత్రణ సంస్థ డైరెక్టర్ డా. ఆంటోనీ ఫాచి, అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం డైరక్టర్ డా. రెడ్‌ఫీల్డ్ ఉన్నారు.
అమెరికా ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన వైరస్ టాస్క్‌ఫోర్స్‌కు ఫాచి నేతృత్వం వహిస్తున్నారు.
డా.ఫాచికి కరోనా నెగిటివ్‌గా తేలినా ముందు జాగ్రత్త చర్యగా రెండు వారాల పాటు స్వీయ నిర్బంధంలో ఉంటారని, అత్యవసరమైతే కనీస జాగ్రత్తలు పాటించి శ్వేతసౌధంలో విధులకు హాజరవుతురాని అధికారులు తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ సహాయకురాలికి, ఉపాధ్యక్షుడు వైక్ పెన్స్ మీడియా కార్యదర్శికి కరోనా పాజిటివ్‌గా తేలిన తర్వాత శ్వేతసౌధంలో కలవరం మొదలైంది.