ETV Bharat / international

కుప్పకూలిన విమానం- ముగ్గురు మృతి - అమెరికాలో విమాన ప్రమాదం

అమెరికాలో ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు.

small plane crash in US
అమెరికాలో కూలిన విమానం
author img

By

Published : Sep 27, 2021, 11:15 AM IST

అమెరికాలోని పశ్చిమ వర్జీనియాలో విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారని అధికారులు తెలిపారు. మృతులను వర్జీనియాకు చెందినవారుగా గుర్తించారు.

సింగిల్​ ఇంజిన్​ బీచ్‌క్రాఫ్ట్​ సీ23 విమానం.. ఉదయం 11గంటలకు ఫాయెట్‌విల్లేలోని ఫాయెట్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే.. కూలిపోయినట్లు ఫెడరల్​ ఏవియేషన్​ అడ్మినిస్ట్రేషన్​ అధికారులు తెలిపారు.

చార్లెస్టన్‌కు ఆగ్నేయంగా న్యూ రివర్ జార్జ్ వంతెన నుంచి 80కిలోమీటర్ల దూరంలో లాన్సింగ్ గ్రామం సమీపంలో శిథిలాలు గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై జాతీయ రవాణా భద్రతా బోర్డు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: Taliban news: 'భరోసా ఇస్తాం.. విమాన సర్వీసులు ప్రారంభించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.