అమెరికాలోని న్యూయార్క్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ముగ్గురు సైనికులు మృతి చెందారు. ఈ ఘటన బుధవారం అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం 6.30కి జరిగింది. ఈ వివరాలను అధికారులు వెల్లడించారు.
శిక్షణ కోసం ఉపయోగించే ఈ హెలికాప్టర్ న్యూయార్క్ సమీపంలోని మెండన్ అనే పట్టణంలో కూలిందని అధికారులు స్పష్టం చేశారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు.
ఇదీ చదవండి : చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు