అమెరికాలోని టెక్సాస్, అలబామా, టెన్నీస్సీ రాష్ట్రాలను టోర్నడోలు కుదిపేశాయి. అనేక సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకొని ముగ్గురు మరణించగా.. పలువురు గాయపడ్డారు. అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రోడ్లపై చెట్లు కూలి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. మరిన్ని టోర్నడోలు వచ్చే అవకాశం ఉందని.. వాతావరణ సంస్థ హెచ్చరించింది.
కాలిఫోర్నియాలో భీకర గాలులు
దక్షిణ కాలిఫోర్నియాలోని పర్వత ప్రాంతాల్లో శాంటా అనా తుపాను ప్రభావంతో ప్రచండ గాలులు వీచాయి. గంటకు 142 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడ్డ గాలుల కారణంగా వందలాది చెట్లు నేలకూలాయి. రహదారిపై వెళ్తున్న పెద్ద పెద్ద ట్రక్కులు సైతం బోల్తాపడ్డాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ సంస్థ హెచ్చరించింది.
ఇదీ చూడండి : మెక్సికోలో కాల్పులు... ఏడుగురు ముష్కరులు హతం