ETV Bharat / international

కారుపై కుప్పకూలిన విమానం- ముగ్గురు మృతి - plane crash in Florida latest news

అమెరికాలో ఓ చిన్న విమానం కూలిన ఘటనలో ముగ్గురు మరణించారు. మరొకరు గాయపడ్డారు. సాంకేతిక సమస్య వల్ల ఓ కారుపై విమానం కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు.

3 dead, 1 hurt in small plane crash in Florida neighbourhood
కారుపై కుప్పకూలిన విమానం- ముగ్గురు మృతి
author img

By

Published : Mar 17, 2021, 2:08 AM IST

అమెరికా దక్షిణ ఫ్లోరిడాలో ఓ చిన్న విమానం కూలి ముగ్గురు మరణించారు. మరొకరు గాయపడ్డారు. ఫ్లోరిడా విమానాశ్రాయానికి వెళ్తున్న ఆ విమానం.. ఓ కారుపై కుప్పకూలింది. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో తన తల్లితో కారులో ప్రయాణిస్తున్న నాలుగేళ్ల బాలుడు మరణించాడు. విమానంలోని ఇద్దరు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. బాలుడు తల్లి మేగన్ బిషప్​.. స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.

బీచ్‌క్రాఫ్ట్ బొనాంజా విమానం.. పెంబ్రోక్​ పైన్స్‌లోని నార్త్​ పెర్రీ విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానంలో కొద్ది సేపటికే సాంకేతిక సమస్య తలెత్తాయని అధికారులు తెలిపారు. దీంతో విమానం ప్రమాదానికి గురైందని పేర్కొన్నారు.

ఈ ప్రమాదంపై ఫెడరల్​ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్​, జాతీయ రవాణా భద్రతా బోర్డు దర్యాప్తు చేస్తున్నాయి.

ఇదీ చూడండి: 'మా టీకా వేసుకుంటేనే దేశంలోకి అనుమతి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.