ETV Bharat / international

'25వ సవరణతో నాకేం ముప్పు లేదు.. కానీ'

25వ రాజ్యాంగ సవరణతో తనకు ఎలాంటి ముప్పు లేదని పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. కానీ, అది జో బైడెన్​, ఆయన పరిపాలన విభాగాన్ని వెంటాడుతుందని హెచ్చరించారు. క్యాపిటల్​ భవనంపై దాడి తర్వాత తొలి పర్యటన సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించారు ట్రంప్​. మరోవైపు.. ట్రంప్​పై 25వ సవరణను ప్రయోగించాలన్న నిర్ణయాన్ని తోసిపుచ్చారు ఉపాధ్యక్షుడు మైక్​ పెన్స్​.

Donald trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్
author img

By

Published : Jan 13, 2021, 9:59 AM IST

అమెరికా క్యాపిటల్​ భవనంపై దాడి నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ను 25వ రాజ్యాంగ సవరణ కింద సాగనంపాలని డెమొక్రట్లు చూస్తున్నారు. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు అధ్యక్షుడు ట్రంప్​. 25వ రాజ్యాంగ సవరణతో తనకు ఎలాంటి ప్రమాదం లేదని, కానీ జో బైడెన్​, ఆయన పరిపాలన విభాగాన్ని వెంటాడుతుందని హెచ్చరించారు.

తన చివరి పర్యటనలో భాగంగా మెక్సికో సరిహద్దు టెక్సాస్​లోని అలామోలో నిర్మించిన గోడను సందర్శించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు ట్రంప్​. ప్రతినిధుల సభలో అభిశంసనపై బుధవారం ఓటింగ్​ జరగనున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

"25వ రాజ్యాంగ సవరణతో నాకు ఎలాంటి ప్రమాదం లేదు. కానీ, జో బైడెన్​, ఆయన పరిపాలన విభాగాన్ని వెంటాడుతుంది. మీరు కోరుకుంటున్న దానితో జాగ్రత్తగా ఉండండి. అభిశంసన అనేది మన దేశ చరిత్రలోనే అత్యంత దుర్మార్గపు చర్యకు కొనసాగింపు. అది కోపం, నొప్పిని కలిగిస్తుంది. అమెరికాకు చాలా ప్రమాదకరమైనది. ముఖ్యంగా ఈ సున్నితమైన సమయంలో."

- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

ఘోరమైన తప్పు: ట్రంప్

ట్విట్టర్​ తన ఖాతాను శాశ్వతంగా నిషేధించిన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడారు అధ్యక్షుడు ట్రంప్​. తన ఖాతాలను తొలగించటాన్ని తప్పు పట్టారు. 'సామాజిక మాధ్యమాల ఖాతాలను నిషేధించటం, రద్దు చేస్తూ పెద్ద టెక్​ సంస్థలు తీసుకున్న నిర్ణయం ఘోరమైన తప్పు అవుతుంది. మన దేశానికి హాని చేసే భయంకరమైన పనిని బాడా టెక్​ కంపెనీలు చేస్తున్నాయని భావిస్తున్నానని పేర్కొన్నారు ట్రంప్​.

తోసిపుచ్చిన పెన్స్​

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ను పదవి నుంచి తొలగించేందుకు 25వ రాజ్యాంగ సవరణను అమలు చేయాలని చేసిన వినతిని తొసిపుచ్చారు ఉపాధ్యక్షుడు మైక్​ పెన్స్​. ఈ మేరకు ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ​ పెలోసీకి లేఖ రాశారు. 'మన రాజ్యంగంలోని 25వ సవరణకు అర్థం ఓ వ్యక్తిని శిక్షించటానికో, అన్యాయంగా అధికారం దక్కించుకునేందుకో కాదు. అలా చేయొద్దు. 25వ సవరణను ప్రారంభించటం భయంకర పరిణామాలకు దారితీస్తుంది. మీకు భాగా తెలుసు. 25వ సవరణ అధ్యక్షుడి అసమర్థత, వైకల్యాన్ని పరిష్కరించటానికి రూపొందించినది.' అని పేర్కొన్నారు. క్యాపిటల్​ భవనంపై దాడి నుంచి కోలుకోవడానికి ఇదే సరైన సమయమని, అమెరికన్లు ఐక్యంగా కలిసి రావాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి: నాపై అభిశంసన తీర్మానం హాస్యాస్పదం: ట్రంప్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.