ETV Bharat / international

దొంగల ముఠాపై పోలీస్​ ఆపరేషన్.. 25 మంది హతం!

బ్రెజిల్​లో ఓ ముఠాకు చెందిన 25 మందిని పోలీసులు హతమార్చారు. వివిధ బ్యాంకులపై దాడి చేసేందుకు వీరు పథకం రచించినట్లు తమకు సమాచారం (Bank Raid in Brazil) అందిందని పోలీసులు తెలిపారు.

police shootout
దొంగల ముఠాపై పోలీస్​ ఆపరేషన్
author img

By

Published : Nov 1, 2021, 8:55 AM IST

బ్యాంక్​ దోపిడీకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానంతో ఓ ముఠాకు చెందిన పలువురిని పోలీసులు మట్టుపెట్టారు. ఈ ఘటన బ్రెజిల్​లోని (Bank Raid in Brazil) మినాస్​ గెరైస్​లో ఆదివారం జరిగింది. ఈ ఆపరేషన్​లో కనీసం పాతిక మంది మృతిచెంది ఉంటారని అధికారులు వెల్లడించారు.

అదే కారణం..

స్థానికులు ఈనెల 2న జరుపుకునే 'ఆల్​ సోల్స్​ డే' సందర్భంగా రాష్ట్రంలోని (Bank Raid in Brazil) వివిధ బ్యాంకులపై దాడి చేసి దోచుకోవాలని ఓ దొంగల ముఠా పథకం వేసినట్టు తమకు సమాచారం అందిందని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో అనుమానితులుగా భావించిన 25 మందిని మట్టుపెట్టామని తెలిపారు. ఘటనాస్థలం నుంచి బుల్లెట్​ప్రూఫ్​ జాకెట్​ సహా పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలు పెరిగిపోయాయని పోలీసులు పేర్కొన్నారు. ఆగస్టులో సావో పాలో రాష్ట్రంలో.. ఓ ముఠా బ్యాంకు దొంగతనానికి పాల్పడిందని.. తుపాకులు, పేలుడు పదార్థాలతో కలకలం సృష్టించి అక్కడి నుంచి పరారైందని తెలిపారు.

ఇదీ చూడండి : COP26 glasgow: సౌరశక్తి బదిలీ కోసం భారత్- యూకే ఒప్పందం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.