అమెరికాలోని కొలరాడో రాష్ట్రం డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంచు తుపాను కారణంగా దాదాపు 2 వేల వరకూ విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. శనివారం 750 విమానాల రాకపోకల్ని నిలిపివేసింది యాజమాన్యం. ఆదివారం మరో 1,120కు పైగా విమానాల రాకపోకలు ఆపేస్తున్నట్లు తెలిపింది.
డెన్వర్‌లో 46 నుంచి 61 సెంటీమీటర్ల మేర హిమపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పర్వత ప్రాంతాల్లో 76 సెంటీమీటర్లు హిమపాతం నమోదవుతుందని తెలిపింది. కొలరాడో నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే అనేక జాతీయ రహదారుల్లో కూడా భారీగా హిమం కురుస్తుండగా.. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.
ఇదీ చూడండి: ప్రవాస ఆసియన్లపై దాడుల పట్ల సత్య నాదెళ్ల విచారం