ETV Bharat / international

రెస్టారెంట్​లో కాల్పులు - ఇద్దరు మృతి - అమెరికా రెస్టారెంట్​లో కాల్పులు

అమెరికాలోని ఓ రెస్టారెంట్​లో ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరిపిన దుండగుడు.. తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది.

shooting
కాల్పుల కలకలం
author img

By

Published : Jul 9, 2021, 12:39 PM IST

అమెరికాలో మరోమారు కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్​లోని హ్యూస్టన్​ నగరంలో ఉన్న ఓ రెంస్టారెంట్​లో ఇద్దరిపై కాల్పులు జరిపి.. తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి. ఈ ఘటనలో తూటాలు తగిలిన ఇద్దరిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ జరిగింది

నగరంలోని అక్వేరియం​ రెస్టారెంట్​లో గురువారం రాత్రి 8 గంటలకు(అమెరికా కాలమానం ప్రకారం) "ఓ పురుషుడు సహా మహిళ.. డిన్నర్​ పూర్తి చేసి వెళ్తున్నారు. మరోవైపు కాచుకుర్చున్న దుండగుడు వారిపై కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనలో మహిళ గాయాలతో బయటపడింది. కానీ దుండగుడు సహా మరో వ్యక్తి చనిపోయారు. దీనికి సంబంధించిన దృశ్యాలు.. రెస్టారెంట్​లోని సీసీకెమెరాల్లో రికార్డు అయ్యాయి" ఆ రెస్టారెంట్​ నిర్వాహకుడు మట్టా స్లింకార్డ్​ తెలిపారు.

గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనకు కారణమేంటో.. వారి మధ్య ఎలాంటి సంబంధముందో.. తెలియలేదని చెప్పారు.

ఇదీ చూడండి: శిలువకు నిప్పు పెట్టి.. పారిపోయేందుకు స్పైడర్​మ్యాన్​లా ఫీట్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.