అమెరికా చికాగోలోని సౌత్సైడ్ ప్రాంతంలో ఓ పార్టీలో కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా.. 10మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల 40 నిమిషాల సమయంలో కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సిఉందని పోలీసు అధికారి జోస్ జరా తెలిపారు. గాయపడ్డవారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందన్నారు.
ఇదీ చదవండి : ఆస్ట్రేలియా 'మిస్టరీ ఫ్లైట్' గురించి మీకు తెలుసా?