ETV Bharat / international

ట్రంప్​ వెంటే ఇండో-అమెరికన్లు.. తేల్చిన సర్వే - Democratics

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. యూఎస్​లోని భారతీయ ఓటర్ల మద్దతు ఎవరికనే అంశం ఆసక్తికరంగా మారుతోంది. కొన్ని కీలకమైన రాష్ట్రాల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ వెంటే ఇండో-అమెరికన్లు​ ఉన్నారంటోంది ఓ సర్వే. ఇందుకు మోదీతో మైత్రిబంధం సహా 12 అంశాలు కీలకంగా పనిచేస్తున్నాయంటోంది.

Indian Americans
ట్రంప్​ వెంటే ఇండో-అమెరికన్లు.. తేల్చిన సర్వే
author img

By

Published : Sep 26, 2020, 2:04 PM IST

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. అయితే భారతీయ ఓటర్లు అధ్యక్షుడు ట్రంప్​వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. భారతీయులను గౌరవిస్తూ, ప్రధాని మోదీని నిజమైన స్నేహితుడిగా చెబుతూ సాగుతోంది ట్రంప్ ప్రచార వ్యూహం. ఇది రిపబ్లికన్లు-డెమోక్రాట్ల మధ్య గట్టి పొటీ నెలకొన్న కొన్ని రాష్ర్టాల్లో భారతీయ ఓటర్లను ఆకర్షిస్తోందంటోంది సర్వే.

భారత్​ పరపతి పెంచేలా అడుగులు

అల్​ మసన్​ నేతృత్వంలోని.. ట్రంప్​ విక్టరీ ఇండియన్​ అమెరికన్​ ఫైనాన్స్​ కమిటీ నిర్వహించిన ఈ సర్వే మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రధానంగా ట్రంప్​ ప్రభుత్వం.. గత అమెరికన్​ ప్రభుత్వాల్లాగా భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవటం కలిసొచ్చిందంటోంది ఈ నివేదిక. కశ్మీర్​ విషయంలో ట్రంప్​ వైఖరి, అదే సమయంలో అంతర్జాతీయంగా భారత్​ పరపతి పెంచేలా ఆయన అడుగులు కీలకంగా నిలిచాయంటోంది.

అయితే, అన్నింటికన్నా ప్రభావితంగా నిలుస్తోంది మాత్రం.. ట్రంప్​-మోదీ మైత్రి బంధమేనంటోంది. ప్రపంచ యవనికపై చైనాకు చెక్​ పెట్టాలంటే.. ఈ జోడీ మరో నాలుగేళ్లు కొనసాగాలని భారతీయ-అమెరికన్లు కోరుకుంటున్నట్లు తేల్చింది ఈ సర్వే.

చైనాపై ట్రంప్​ వైఖరి

ట్రంప్​నకు భారతీయుల మద్దతు వెనక.. మరో ముఖ్యమైన అంశం చైనాపై ట్రంప్​ వైఖరి. యుద్ధమేఘాలు కమ్ముకున్నా ట్రంప్ సంయమనం పాటిస్తుండటమే ఇందుకు కారణం. కరోనా విలయానికి ముందు శాంతియుతంగా అమెరికన్​ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టిన తీరుకు.. ఇండియన్​-అమెరికన్లు మంత్రముగ్ధులయ్యారంటోంది ఈ సర్వే.

tump-modi
మోదీతో ట్రంప్ మైత్రిబంధం

ట్రంప్​-మోదీ మైత్రి

ట్రంప్​ అంతర్జాతీయ వేదికలపై భారత్​ ప్రతిష్ఠ పెంచారు. అమెరికాతో దోస్తీ విధానాలతో ప్రధాని నరేంద్ర మోదీ సైతం స్నేహహస్తం చాచారంది సర్వే. ప్రస్తుతం భారత్​-అమెరికా సంబంధాలు బలమైన బంధంగా నిలిచాయని.. ట్రంప్​-మోదీ కలిసికట్టుగా తీసుకుంటున్న నిర్ణయాలు.. ఇరుదేశాలకు మరింత మేలు చేస్తున్నాయని స్పష్టం చేస్తోంది.

అలాగే, అమెరికాలో ఉంటున్న ప్రతి భారతీయుడికి స్వదేశంలో కుటుంబ సభ్యులో, వ్యాపారాలో ఉంటాయి. సరిహద్దులో ఉద్రిక్తితల నేపథ్యంలో వారు చైనా నుంచి తమవారికి రక్షణ కోరుకుంటారు. ఆ నమ్మకం ట్రంప్​ ఇవ్వగలరని భావిస్తున్నారని, అదే సమయంలో అధ్యక్షుడిగా ట్రంప్ లేకపోతే చైనా.. భారత్​పైకి యుద్ధానికి వెనకాడదని​ చెబుతోంది సర్వే నివేదిక. ఇది అధ్యక్షుడు ట్రంప్​ వెంటే భారతీయ ఓటర్లు నడిచేందుకు తోడ్పడుతుందని పేర్కొంది.

ఈ నేపథ్యంలో.. రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని భావిస్తున్న కొన్ని రాష్ట్రాల్లో భారతీయ ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా మారనున్నారు.

రాష్ట్రాలుభారతీయ ఓటర్లు
టెక్సాస్4,70,000
ఫ్లోరిడా1,90,000
పెన్సిల్వేనియా 1,70,000
వర్జీనియా1,65,000
జార్జియా 1,50,000
మిచిగాన్1,20,000
ఉత్తర-కరోలినా1,10,000

మసన్ బృందం సర్వే కోసం దాదాపు 50 శాతం మంది భారతీయ ఓటర్లను సంప్రదించినట్లుగా చెబుతోంది. ఏళ్లుగా డెమోక్రటిక్​ పార్టీగా మద్దతుగా నిలుస్తోన్న వీరంతా... ఈసారి ట్రంప్​ సారథ్యానికే ఓటేయనున్నట్లుగా తేల్చి చెబుతోంది.

ఇలా భారీ సంఖ్యలో ప్రజలు తమ అభిప్రాయం మార్చుకోవటం వల్ల.. ట్రంప్​ కొత్త ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, మరోసారి అధ్యక్షుడిగా శ్వేతసౌథంలో అడుగుపెట్టేందుకు తోడ్పడుతుందని సర్వే అంచనా వేస్తోంది.

అమెరికాలోని భారతీయ ఓటర్ల అభిప్రాయం..

"బైడెన్, హ్యారిస్​, డెమోక్రాట్లు.. ట్రంప్​ వ్యతిరేకులు సర్వే చేసిన మాసన్​ అంటే భయపడుతున్నారు. కారణం ఏంటంటే కీలకమైన రాష్ట్రాల్లో భారతీయ-అమెరికన్లు ట్రంప్​వైపు మొగ్గుచూపుతున్నారన్న నిజం ఆయన చెప్పటమే. అల్​ మసన్​ ఫండ్​రైజింగ్​ ప్రయత్నాలు కూడా సత్ఫలితాలు ఇస్తున్నాయి."

- శ్రీధర్ చిట్యాల, ఇండియన్​ వాయిస్ ఫర్​ ట్రంప్ సభ్యుడు​

"టీవీల్లో వంద కోట్ల మంది చూస్తుండగా.. లక్ష మంది గుజరాతీలను ట్రంప్​నకు కుటుంబంగా మోదీ పరిచయం చేయటం చాలా ఉత్తేజాన్నిచ్చింది."

- గిరీశ్​ గాంధీ, ఫ్లోరిడా

"కశ్మీర్ సమస్య, 370 అధిరకరణం రద్దు, పౌరసత్వ సవరణ చట్టం.. వంటి కీలక నిర్ణయాలు ప్రధాని మోదీ తీసుకున్నారు. ఈ అంశాల్లో ట్రంప్​ భారత ప్రధానికి మద్దతుగా నిలిచారు. వీరిరువురి నాయకత్వంలో భవిష్యత్తులో మరిన్ని గొప్ప నిర్ణయాలకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం."

- డా.ఆనంద్​ తమహాంకర్, న్యూజెర్సీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.