ETV Bharat / international

117 మిలియన్ల మంది చిన్నారులకు 'తట్టు' ముప్పు- ఐరాస హెచ్చరిక - రాబిన్ నండీ, యునిసెఫ్ ఇమ్యునైజేషన్ చీఫ్

అంతర్జాతీయంగా కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో తట్టు వ్యాక్సిన్​ వేసే కార్యక్రమాలను నిలిపివేశాయి పలు దేశాలు. దాని వల్ల 117 మిలియన్ల మంది పిల్లల్లో తట్టు వ్యాధి ప్రబలే అవకాశం ఉందని హెచ్చరించింది ఐక్యరాజ్య సమితి.

117 million children face measles risk from COVID-19 response: UN
117 మిలియన్ల చిన్నారులకు 'తట్టు' ముప్పు- ఐరాస హెచ్చరిక
author img

By

Published : Apr 15, 2020, 5:18 AM IST

Updated : Apr 15, 2020, 5:29 AM IST

ప్రపంచ వ్యాప్తంగా 117 మిలయన్ల మంది చిన్నారులకు తట్టు వ్యాధి పొంచి ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ప్రస్తుతం మానవాళిని వణికిస్తున్న కరోనా వైరస్​ విజృంభణ నేపథ్యంలో.. దానికి సంబంధించిన టీకా వేసే కార్యక్రమాలను పలు దేశాలు నిలిపివేయడమే తట్టు ప్రబలడానికి కారణమవుతుందని ఐరాస అభిప్రాయపడింది.

ప్రస్తుతం 24 దేశాల్లో తట్టు తీవ్రత అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో తట్టుకు సంబంధించిన టీకా సరఫరాను నిలిపివేసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూఎన్​ఐసీఈఎఫ్​ సంయుక్తగా ప్రకటించాయి. మరో 13 దేశాల్లో కరోనా వ్యాప్తి కారణంగా టీకా వేసే కార్యక్రమాలకు అడ్డుకట్ట పడిందని తెలిపింది ఐరాస.

ప్రస్తుతం కరోనా ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపతోంది. తట్టు కూడా ప్రాణాంతకరమైన వ్యాధి. దీనికి సంబంధించిన టికా ఇప్పటికి సిద్ధంగా ఉంది. కనుక కరోనా భౌతిక దూరం నిబంధనలు సడలించిన తర్వాత తట్టుకు చెందిన వ్యాక్సినేషన్​​పై దృష్టి సారించాలని ఆయా దేశాలను కోరుతున్నాను.

-రాబిన్ నండీ, యునిసెఫ్ ఇమ్యునైజేషన్ చీఫ్

ప్రతి సంవత్సరం 20 మిలియన్ల మంది ప్రజలు తట్టు బారిన పడుతున్నారు. వీరిలో ఎక్కువగా ఐదేళ్ల వయస్సు లోపు వారు కావటం గమనార్హం. చాలా చవకగా, సులభంగా లభించే వ్యాక్సిన్​ ఉన్నప్పటికీ ఇటివల తట్టు కేసులు పెరగటం ఆందోళన కలిగించే అంశమని ఐరాస వెల్లడించింది.

2018లో 1,40,000 మంది తట్టుతో మృత్యువాతపడగా.. వీరిలో పిల్లలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. డీఆర్​ కాంగో దేశంలోనే దీని కారణంగా 6 వేల మంది మరణించారు. తట్టు టీకాను అందించే కార్యక్రమాలను నిలిపివేయటం వల్ల వ్యాధి కేసులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది ఐరాస. ముఖ్యంగా బంగ్లాదేశ్, బ్రెజిల్, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, దక్షిణ సూడాన్, నైజీరియా, ఉక్రెయిన్​, కజికిస్థాన్​ దేశాలు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది.

Last Updated : Apr 15, 2020, 5:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.