ETV Bharat / international

ట్రంప్​ అభిశంసనకు కోటి సంతకాల సేకరణ - డొనాల్డ్​ ట్రంప్​

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అభిశంసనకు చట్టసభ్యులు చర్యలు చేపట్టాలని కోటి సంతకాల సేకరణ చేపట్టారు. కాంగ్రెస్​కు సంతకాల జాబితాను అందించిన సామాజిక కార్యకర్తలకు రెండు సభల డెమొక్రాట్లు మద్దతు పలికారు.

ట్రంప్​ అభిశంసనకు కోటి సంతకాల సేకరణ
author img

By

Published : May 10, 2019, 2:58 PM IST

Updated : May 10, 2019, 3:33 PM IST

ట్రంప్​ అభిశంసనకు కోటి సంతకాల సేకరణ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు అభిశంసన చిక్కులు తప్పేలా లేవు. గత నెలలో డెమొక్రటిక్​ పార్టీ సెనెటర్​, ఆశావాహ అధ్యక్ష అభ్యర్థి ఎలిజబెత్​ వారెన్​ అభిశంస ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. తాజాగా కొంత మంది సామాజిక కార్యకర్తలు అధ్యక్షుడికి వ్యతిరేకంగా కోటి మంది సంతకాలు సేకరించారు. ఈ దస్త్రాలను కాంగ్రెస్​కు సమర్పించారు. ట్రంప్​ అభిశంసనకు చట్టసభ్యులు చర్యలు చేపట్టాలని అభ్యర్థించారు. ఇందుకు రెండు సభల డెమొక్రాట్లు మద్దతు ప్రకటించారు.

రష్యా జోక్యంపై...

ట్రంప్​ అభిశంసనకు డిమాండ్​ చేయడానికి కారణాల్లో... రష్యా అంశం ఒకటి. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై రాబర్ట్​ మ్యూలర్​ నివేదికలో తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని స్పష్టమైందని ప్రకటించారు ట్రంప్​. కానీ అధ్యక్షుడు విచారణను అడ్డుకున్నారని కొంతమంది డెమొక్రాట్లు ఆరోపించారు. రష్యా వ్యవహారంలో అనుమానాలు వ్యక్తంచేస్తూ ఇటీవలే ఎలిజబెత్ వారెన్​ అభిశంసన ప్రతిపాదన తెచ్చారు.

హెచ్చరించిన నాన్సీ పెలోసి

అధ్యక్షుడి అభిశంసనపై స్పీకర్​ నాన్సీ పెలోసితో పాటు కొంత మంది సీనియర్​ డెమొక్రాట్లు హెచ్చరించారు. 325 మిలియన్ల ప్రజల మధ్య విభేదాలు తలెత్తుతాయని పేర్కొన్నారు. అది 2020 అధ్యక్ష ఎన్నికలపై ప్రభావం చూపుతుందని విశ్లేషించారు.

ఇదీ చూడండి: చర్చలు కొలిక్కా... లేక మళ్లీ మొదటికా!

Bhopal (MP), May 09 (ANI): Union Defence Minister Nirmala Sitharaman on Thursday addressed a public rally in Madhya Pradesh's Bhopal. Answering a question asked about does she consider former prime minister Rajiv Gandhi as a martyr or not, she said, "Rajiv Gandhi was the prime minister of the country. We all know in which unfortunate situation he became a martyr and for that we respect him, but that doesn't mean that we can't talk about the corruption during his governance, about the misrule during his governance, about the Bhopal gas tragedy in which he helped Anderson to leave the country." "We know where to give respect but will raise questions, whenever it is required."
Last Updated : May 10, 2019, 3:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.