ETV Bharat / international

అమెరికా చరిత్రలో రికార్డు ఓటింగ్​! - అమెరికా ముందస్తు ఓటింగ్

అమెరికాలో దాదాపు 10 కోట్ల మంది ఓటర్లు ముందస్తుగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికలు జరిగే రోజున మరో 6 కోట్ల మంది పోలింగ్ బూత్ గడప తొక్కనున్నారు. దీంతో మొత్తం 16 కోట్ల ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది.

10 crore Americans have already voted, another 6 crore likely to vote on Tuesday
అమెరికాలో 10 కోట్ల మంది ముందస్తు ఓటింగ్
author img

By

Published : Nov 3, 2020, 9:57 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి రికార్డు స్థాయిలో ముందస్తు ఓటింగ్ నమోదైంది. దాదాపు 10 కోట్ల మంది ముందస్తుగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ రోజు మరో 6 కోట్ల మంది ఓటింగ్​కు తరలిరానున్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతో మొత్తంగా 16 కోట్ల మంది ఓటర్లు అమెరికా అధ్యక్ష ఎన్నికలో పాల్గొన్నట్లు అవుతుంది.

ఇది మొత్తం ఓటర్లలో 67 శాతమని అంచనా వేశారు ఫ్లోరిడా యూనివర్సిటీ అనుబంధ ఆచార్యులు మైఖేల్ పీ మెక్​డొనాల్డ్. ఈ స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు కావడం 1900 సంవత్సరం తర్వాత ఇదే తొలిసారి అవుతుందని పేర్కొన్నారు.

"మంగళవారం ఉదయం నాటికి సుమారు పది కోట్ల ఓట్లు పోలవుతాయని తెలుస్తోంది. ఓటర్ టర్నోవర్ 2016తో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో గత ఎన్నికల ఓటింగ్​ రికార్డు బద్దలైంది."

-మైఖేల్ పీ మెక్​డొనాల్డ్, ఫ్లోరిడా యూనివర్సిటీ అనుబంధ ఆచార్యులు

హవాయి, టెక్సాస్, మోంటనా రాష్ట్రాల్లో 2016తో పోలిస్తే ఓటర్ టర్నవుట్ దాటిపోయింది. ఉత్తర కరోలినా, జార్జియా, న్యూ మెక్సికో, నెవాడా, టెన్నెస్సీ రాష్ట్రాల్లో గత ఎన్నికలతో పోలిస్తే 90 శాతం ఓటింగ్ నమోదైంది.

గత రెండు ఎన్నికల్లో ముందస్తు ఓటింగ్ డెమొక్రాట్లకు అనుకూలంగా ఉన్నట్లు తేలిందని మెక్​డొనాల్డ్ తెలిపారు. 2016తో పోలిస్తే ప్రస్తుత ముందస్తు ఓటింగ్​లో మార్పు కనిపించిందని చెప్పారు. ఇది డెమొక్రాట్లకు కలిసొచ్చే అవకాశం ఉందని చెప్పారు. అయితే గతంలో హోరాహోరీ పోరు జరిగిన ఫ్లోరిడా, ఉత్తర కరోలినాలో ఈసారి కూడా పరిస్థితి అలాగే ఉంటుందని అభిప్రాయపడ్డారు.

"ప్రతీ రాష్ట్రంలో ఓటర్ టర్నోవర్​ను అంచనా వేసి, జాతీయ స్థాయిలో మదింపు వేసినప్పుడు.. మొత్తం ఓటర్ల సంఖ్య 16.02 కోట్లుగా ఉంటుందని లెక్కించాను. ఇది అర్హులైన మొత్తం ఓటర్లలో 67 శాతం."

ఏ పార్టీకి సంబంధం లేని ఓటర్ల సంఖ్య 2016తో పోలిస్తే అధికంగా ఉంటుందని చెప్పారు మెక్​డొనల్డ్. వీరంతా ఎన్నికల సర్వేలో ఇండిపెండెంట్లుగా గుర్తించినవారు కాదని తెలిపారు. అధికారుల వివరాల ప్రకారం 3,19,58,869 ఎన్నికల బ్యాలెట్లు ఇంకా తిరిగి రాలేదని వెల్లడించారు.

విజయం ఒకే వైపు లేదు..

రికార్డు స్థాయిలో ముందస్తు ఓటింగ్ డెమొక్రాటిక్ పార్టీకి కలిసొస్తుందని జో బైడెన్ మద్దతుదారుడు అజయ్ జైన్ భుటోరియా తెలిపారు. 10 కోట్ల మంది ఇప్పటికే ఓటేశారని చెప్పారు. 2016లో ఇదే సమయానికి 5 కోట్ల మంది ఓటర్లు మాత్రమే ముందస్తుకు మొగ్గు చూపారని పేర్కొన్నారు.

"ట్రంప్ ఫ్లోరిడాలో గెలవాల్సి ఉంటుంది. అధ్యక్షుడిగా ఆయన విజయం సాధించడానికి ఇది కీలకమైన రాష్ట్రం. ట్రంప్ ఫ్లోరిడాలో గెలిస్తే ఉత్తర కరోలినా, జార్జియా రాష్ట్రాల్లోనూ గెలిచే అవకాశం ఉంటుంది. అయితే 270 ఎలక్ట్రోరల్​ ఓట్లు సాధించేందుకు బైడెన్​కు ఇంకా మార్గం ఉంది. విజయం ఒకే వైపు లేదు."

-అజయ్ జైన్ భుటోరియా

ముందస్తు ఓటింగ్ డెమొక్రాట్లకు కలిసొస్తుందని ది హిల్ వార్తా పత్రిక చెప్పుకొచ్చింది. ఓటింగ్​లో రిపబ్లికన్లపై డెమొక్రాట్లకు సంపూర్ణ ఆధిక్యం దక్కిందని పేర్కొంది. అయితే ట్రంప్ బృందం వీటిని కొట్టిపారేస్తోంది. నిశబ్ద మెజారిటీ తమను గెలిపిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.