ETV Bharat / international

కరోనా కోసం 10 మందులపై అమెరికాలో ట్రయల్స్

కరోనా వైరస్​కు మందు కనిపెట్టేందుకు కృషి చేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. దేశంలో 10 రకాల ఔషధాలపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ పనితనంపైనా ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ పేర్కొన్నారు.

Trump
ట్రంప్
author img

By

Published : Apr 9, 2020, 12:56 PM IST

కరోనా మహమ్మారికి పరిష్కారం కనుగొనే దిశగా అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం 10 రకాల ఔషధాలకు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని స్పష్టం చేశారు.

"అమెరికన్ పరిశ్రమల ప్రయత్నాలకు వైద్యులు, శాస్త్రవేత్తలు సహకారం అందిస్తున్నారు. 10 ఔషధాలు ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్​లో ఉన్నాయి. ఎలాంటి ఆలస్యం లేకుండా కరోనా చికిత్స విధానాలను రూపొందించేందుకు మా పాలనా విభాగం తీవ్రంగా కృషి చేస్తోంది. వైద్యులు, ల్యాబ్ సహాయకులు, సంస్థలు త్వరలోనే శుభవార్త చెబుతారని ఆశిస్తున్నా."

- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

మలేరియా మందుపై..

మలేరియాకు వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్​పైనా నాలుగు వేర్వేరు క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తెలిపారు. కరోనాకు హైడ్రాక్సీక్లోరోక్విన్​తో చికిత్స చేసే అవకాశం ఉన్నట్లు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ గుర్తించిందని స్పష్టం చేశారు.

వైద్యులు కూడా ఈ మందును సూచిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు మైక్. హెన్రీ ఫోర్డ్ ఆసుపత్రిలో 3 వేల మందికి ఈ ఔషధాన్ని ఇచ్చామన్నారు.

మందులేని కారణంగా..

కరోనాకు టీకా, మందు లేని కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటివరకు అన్ని దేశాల్లో కలిపి 88,500 మంది మరణించారు. 15 లక్షల మందికి వైరస్ సోకింది. అమెరికాలో అత్యధికంగా 4.3 లక్షల మందికి వైరస్ సంక్రమించగా.. 14,700 మంది మృత్యువాత పడ్డారు.

ఇదీ చూడండి: భారత్ సాయాన్ని ఎప్పటికీ మర్చిపోం: ట్రంప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.