ETV Bharat / international

వంతెన​ కింద వేలాడిన 9 మృతదేహాలు.. ఎక్కడివి? - మెక్సికోల మృతదేహాల కలకలం

ప్రధాన రహదారిలోని పైవంతెనకు వేలాడుతున్న 9 మృతదేహాలను(bodies found in mexico) అధికారులు గుర్తించారు. మరో మృతదేహం దారిపక్కన కనిపించింది. మెక్సికోలోని జకాటెకాస్​లో(bodies found in mexico 2021 ) ఈ సంఘటన జరిగింది. ఇంతకూ ఆ మృతదేహాలు ఎక్కడివి?

mexico
మృతదేహాలు
author img

By

Published : Nov 19, 2021, 2:14 PM IST

Updated : Nov 20, 2021, 5:29 PM IST

వంతెన​ కింద వేలాడిన మృతదేహాలు

మెక్సికోలోని జకాటెకాస్​ రాష్ట్రంలో(bodies found in mexico 2021) గురువారం ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం కనిపించింది. ఫ్లైఓవర్​ కింద వేలాడుతున్న(bodies hanging) 9 మృతదేహాలను గుర్తించారు అధికారులు. పదో మృతదేహం దూరంగా దారిపక్కన కనిపించినట్లు తెలిపారు. ఈ దృశ్యాలను పరిశీలిస్తే రాష్ట్రంలో పట్టు సాధించాలనే డ్రగ్స్​ ముఠాల(drug gangs in mexico) పనిగా తెలుస్తోందని పేర్కొన్నారు.

" మృతదేహాలు మెక్సికో నగరానికి ఉత్తరాన 550 కిలోమీటర్ల దూరంలోని సియుడాడ్​ క్యూటెమోక్​లో గుర్తించాం. పదో మృతదేహం దారి పక్కన కనిపించింది. బాధితులంతా పురుషులే."

- జకాటెకాస్​ రాష్ట్ర పబ్లిక్​ సేఫ్టీ ఏజెన్సీ.

మత్తు పదార్థాలను సరఫరా చేసే కీలక ప్రాంతంగా జకాటెకాస్​ మారింది. ముఖ్యంగా శక్తిమంతమైన సింథటిక్​ పెయిన్​ కిల్లర్​ ఫెంటనైల్​ వంటి వాటిని అమెరికా సరిహద్దులకు ఇక్కడి నుంచే చేరవేస్తారు. దీంతో ఈ రాష్ట్రంపై పట్టు సాధించేందుకు డ్రగ్స్​ సరఫరా ముఠాలు(drug gangs in mexico) ప్రయత్నిస్తున్నాయి.

తమ ప్రత్యర్థులు, అధికారులు, స్థానికులను భయబ్రాంతులకు గురి చేసే క్రమంలో ఇలా మృతదేహాలను బహిరంగంగా వేలాడదీస్తారని అధికారులు తెలిపారు. ఈ ఏడాది 25వేల మంది హత్యకు గురయ్యారని, గతేడాదితో పోల్చితే 3.4 శాతం తక్కువేనని చెప్పారు.

ఇదీ చూడండి: కాల్పుల్లో 8 మంది మృతి- మెక్సికోలో భారత మహిళ..

Last Updated : Nov 20, 2021, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.