ETV Bharat / international

అమెరికాలో కాల్పులు.. ఆరుగురు దుండగులు మృతి - అమెరికాలో పోలీసుల కాల్పులు

అమెరికాలో పోలీసులు వివిధ ప్రాంతాల్లో జరిపిన కాల్పుల్లో ఆరుగురు దుండగులు మృతిచెందారు. వీరినుంచి ఆయుధాలు, బాంబు డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. లౌసీనియాలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురికి గాయాలయ్యాయి.

US FIRE
అమెరికాలో కాల్పులు
author img

By

Published : Apr 25, 2021, 1:01 AM IST

అమెరికాలో పోలీసులు శనివారం జరిపిన వివిధ కాల్పుల్లో ఆరుగురు దుండగులు మృతి చెందారు. కొలంబస్, కాలిఫోర్నియా, మసాచుసెట్స్‌.. లో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో ఆరుగురు దుండగులు మృతి చెందారు. వీరి నుంచి ఆయుధాలు, డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. టెన్నెస్సీలో విధులు నిర్వహిస్తున్న ఓ ట్రాఫిక్ పోలీస్​పై ఓ వ్యక్తి కత్తితో దాడికి యత్నించగా పోలీస్​ అధికారి.. ఆ వ్యక్తిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో దుండగుడు మృతిచెందాడు.

ఐదుగురికి గాయాలు

లౌసీనియా రాష్ట్రం, న్యూ ఓర్లియాన్స్​ నగరంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించామన్నారు.

ఇదీ చదవండి : అంతరిక్ష కేంద్రాన్ని చేరుకున్న నలుగురు వ్యోమగాములు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.