తుపాను కారణంగా అమెరికా లూసియానా తీరంలోని పోర్ట్ ఫార్చూన్ ఓడరేవుకు సమీపంలో ఓ నౌక సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో పడవలోని సిబ్బంది ఒకరు మరణించగా.. మరో ఆరుగురిని కోస్ట్‌గార్డు అధికారులు రక్షించారు. మరో 12 మంది ఆచూకీ గల్లంతైనట్లు తెలిపారు.
''గంటకు 130-145 కిమీ వేగంతో గాలులు వీయడం వల్ల అలలు 3 మీటర్ల మేర ఎగసిపడ్డాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అయినప్పటికీ మిగతా 12 మందిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం.''
-విల్ వాట్సన్, కోస్ట్ గార్డ్ కెప్టెన్
లూసియానా తీరం నుంచి న్యూ ఓర్లీన్స్ వరకు తీవ్ర ప్రభావం చూపిన తుపాను.. నౌకాశ్రయ ఆస్తులను తీవ్రంగా దెబ్బతీసింది. లూసియానాకు దక్షిణాన ఉన్న పోర్ట్ ఫార్చూన్ ఓడరేవు.. అమెరికా చమురు, గ్యాస్ పరిశ్రమకు ఒక ప్రధాన స్థావరంగా ఉంది.
ఇదీ చదవండి: సుడిగుండంలో ఓడ- సిబ్బందిని కాపాడిన విపత్తు దళం