ETV Bharat / international

'ఆమె' శరీరంలో 32 రకాల మ్యూటేషన్స్‌

దక్షిణాఫ్రికాలోని ఓ మహిళ శరీరంలో కరోనా వైరస్‌ తీవ్రంగా మ్యూటేషన్స్‌ అవడాన్ని పరిశోధకులు గుర్తించారు. ఆమె హెచ్​ఐవీతో బాధపడుతున్నట్లు తెలిపారు. సుమారు 216 రోజుల నుంచి వైరస్​తో పోరాటం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

32 virus mutations inside a lady body
మహిళ శరీరంలో కరోనా మ్యూటేషన్
author img

By

Published : Jun 6, 2021, 10:59 PM IST

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ ఒక్కో దేశంలో ఒక్కో రూపంలో విజృంభిస్తోంది. ఎప్పటికప్పుడు ఉత్పరివర్తనం చెందుతూ కొత్త రూపును సంతరించుకుంటోంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాలోని ఓ మహిళ శరీరంలో కరోనా వైరస్‌ తీవ్రంగా మ్యూటేషన్స్‌ అవడాన్ని గుర్తించారు. 36ఏళ్ల ఆ మహిళ హెచ్‌ఐవీతో బాధపడుతుండగా, 216 రోజుల నుంచి కరోనా వైరస్‌తో పోరాడుతోంది. కరోనా సోకిన రోజు నుంచి ఆమె శరీరంలో దాదాపు 30 రకాలుగా పైగా కరోనా ఉత్పరివర్తనం చెందినట్లు పరిశోధకులు గుర్తించారు.

మెడికల్‌ జర్నల్‌ మెడ్రిక్స్‌వి ఈ అసాధారణ కేసుకు సంబంధించిన వివరాలను ప్రచురించింది. అయితే, దీనిపై ఇప్పటివరకూ పునః పరిశీలన జరపలేదు. సదరు మహిళ 2006లో హెచ్‌ఐవీ బారిన పడింది. క్రమంగా ఆమె రోగనిరోధక వ్యవస్థ క్షీణిస్తూ వచ్చింది. గతేడాది సెప్టెంబరులో ఆమె కరోనా బారిన పడింది. అప్పటి నుంచి ఆమెలో కరోనా వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌ 13 రకాలుగా ఉత్పరివర్తనం చెందగా, జన్యుపరంగా 19 రకాలు రూపాంతరం చెందింది. E484K, B.1.1.7, N510Y, B.1.351 ఇలా ఆమె శరీరంలో పలు రకాలుగా కరోనా వైరస్‌ ఉత్పరివర్తనం చెందడాన్ని పరిశోధకులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో హెచ్‌ఐవీ బారిన పడిన వారు కరోనా విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు. అంతేకాదు, తీవ్ర వ్యాధులతో సతమతమవుతున్న వారు కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి: Covaxin: పిల్లలపై క్లినికల్​ ట్రయల్స్​ షురూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.