కాంగోలో గోమా నగరం వద్ద ఉన్న ఇరగోంగో అగ్నిపర్వతం.. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత పేలింది. అగ్నిపర్వతం విస్ఫోటనంతో అగ్నికీలలు ఉవ్వెత్తున్న ఎగిసిపడుతూ.. రహదారులను కమ్మేశాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. భయభ్రాంతులతో ప్రజలు గోమా నగరాన్ని ఖాళీ చేస్తున్నారు.
ఈ ఘటనపై ఐరాస శాంతి భద్రత బృందం స్పందించింది. లావా గోమా నగరం వైపు వెళ్లటం లేదని తెలిపింది. ప్రస్తుతం తాము అప్రమత్తంగానే ఉన్నట్లు పేర్కొంది. ఇరగోంగో అగ్నిపర్వతం 2002లో మొట్టమొదటి సారిగా విస్ఫోటనం చెందింది.
ఇదీ జరిగింది: రోడ్డెక్కని ప్రయాణికుల భద్రత