ETV Bharat / international

కరోనాతో గాంధీ మునిమనవడు మృతి - సతీశ్ దుఫేలియా కన్నుమూత

కరోనాతో మహాత్మా గాంధీ మునిమనవడు సతీశ్ ధుపేలియా (66) ప్రాణాలు కోల్పోయారు. కొన్నాళ్లుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సతీశ్​కు ఆదివారం హఠాత్తుగా గుండే పోటు రావడం వల్ల కన్నుమూసినట్లు ఆయన సోదరి ఉమా ధుపేలియా మెస్త్రీ వెల్లడించారు.

Gandhi Great grandson Satish Dhupelia dies with covid
కరోనాతో మహాత్మాగాంధీ మునిమనవడు మృతి
author img

By

Published : Nov 23, 2020, 5:25 AM IST

మహాత్మా గాంధీ మునిమనవడు సతీశ్​ ధుపేలియా (66) కరోనాతో కన్నుమూశారు. దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్​బర్గ్​లో నివసించే సతీశ్​ కొంతకాలంగా న్యూమోనియాతో బాధపడుతున్నారు. నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ సమయంలోనే కరోనా బారిన పడ్డారు.

మూడు రోజుల క్రితమే జన్మదినం జరపుకొన్న సతీశ్ ఆదివారం రాత్రి హఠాత్తుగా గుండేపోటు రావడం వల్ల తుది శ్వాస విడిచినట్లు.. ఆయన సోదరి ఉమా ధుపేలియా మెస్త్రీ తెలిపారు.

సతీశ్ దక్షిణాఫ్రికాలో గాంధీ డెవలప్​మెంట్ ట్రస్ట్ కార్యకలాపాలు నిర్వహించేవారు సామాజిక కార్యకలాపాల్లోనూ చురుగ్గా పాల్గొనేవారు. సతీశ్ ధుపేలియా తన జీవితంలో ఎక్కువ భాగం మీడియా రంగంలోనే గడిపారు. వీడియో, ఫోటో గ్రాఫర్​గా పని చేశారు.

ఇదీ చూడండి:మోడెర్నా, ఫైజర్‌ కంటే తక్కువ ధరలోనే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.