ETV Bharat / international

ఆ దేశ పార్లమెంట్​ సమావేశం​.. పోర్నోగ్రఫీతో హ్యాక్​! - SA Assembly meeting hacked

లాక్​డౌన్​ నేపథ్యంలో పార్లమెంట్​ సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా నిర్వహిస్తోంది దక్షిణాఫ్రికా ప్రభుత్వం. గురువారం సమావేశం జరుగుతున్న సమయంలో సభ్యులకు ఇబ్బందికర పరిణామం ఎదురైంది. అశ్లీల చిత్రాలతో సమావేశానికి ఇబ్బంది కలిగించారు హ్యాకర్లు.

South Africa parliament video call hacked with pornography
ఆ దేశ పార్లమెంట్​ సమావేశం.. పోర్నోగ్రఫీతో హ్యాక్​!
author img

By

Published : May 8, 2020, 10:13 AM IST

కరోనా నియంత్రణ దిశగా లాక్​డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో వీడియో కాల్​ ద్వారా పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తోంది దక్షిణాఫ్రికా . అయితే సమావేశం మధ్యలో అనుకోకుండా జరిగిన ఓ పరిణామం సభ్యులకు ఇబ్బంది కలిగించింది. అశ్లీల చిత్రాలు మధ్యలో పోస్ట్​ చేశారు హ్యాకర్లు. ఆ దేశ అసెంబ్లీ స్పీకర్​ థాండి మొడిసె లక్ష్యంగా జాత్యాంహకార, లింగవివక్షతతో కూడిన పోస్టులు చేశారు.

కరోనా నియంత్రణ దిశగా దక్షిణాఫ్రికా పార్లమెంట్​ను భౌతికంగా నిలిపేసింది సిరిల్​ రామఫోసా ప్రభుత్వం. పార్లమెంట్ సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్​ ద్వారానే నిర్వహిస్తోంది. అనుకోని ఘటన పట్ల షాక్​ తిన్న ఛైర్​పర్సన్ మొడిసె.. వీడియో సమావేశాలకు 'జూమ్​' సరైన వేదిక కాదని తాను ముందే హెచ్చరించినట్లు చెప్పుకొచ్చారు. అయితే.. మరో లింక్​ ద్వారా సమావేశాలను కొనసాగించారామె.

సులభ లక్ష్యంగా 'జూమ్'..

అభ్యంతరకర పోస్టులతో సమావేశాలకు అంతరాయం కలిగిస్తోందని జూమ్​పై ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. కరోనా కారణంగా వినియోగదారులు ఎక్కువగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో జూమ్​ హ్యాకర్లకు సులభ లక్ష్యంగా మారుతోందని చెబుతున్నారు.

ఇదీ చదవండి: ప్రపంచంపై కరోనా 2.0 విలయతాండవం సృష్టించనుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.