Omicron symptoms: ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్ భౌగోళిక ముప్పుగా పరిణమిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. గతంలో బయటపడ్డ డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తూ ఇప్పటికే అనేక దేశాలకు పాకింది. కానీ, ఇప్పటికీ.. ఒమిక్రాన్ వ్యాధి తీవ్రత, లక్షణాలపై స్పష్టమైన సమాచారం మాత్రం రావట్లేదు. అయితే ఒమిక్రాన్ సోకిన బాధితుల్లో డెల్టా కంటే భిన్నమైన లక్షణాలు కన్పిస్తున్నాయని దక్షిణాఫ్రికాకు చెందిన ఓ డాక్టర్.. అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు. ఈ వేరియంట్ బారిన పడిన కొందరు రాత్రిళ్లు విపరీతమైన చెమటతో బాధపడుతున్నారని అన్నారు.
"ఒమిక్రాన్ బారిన పడిన వారిలో భిన్నమైన లక్షణాలు కన్పిస్తున్నాయి. అయితే అవి స్వల్పంగానే ఉన్నాయి. కొవిడ్ 19 సాధారణ లక్షణాలైన దగ్గు, తరచూ ముక్కు కారడం, గొంతు నొప్పి, తీవ్రమైన జ్వరం వంటివి కొత్త వేరియంట్ బాధితుల్లో లేవు. ఒమిక్రాన్ సోకినవారు ఎక్కువగా తీవ్రమైన తలనొప్పి, ఒళ్లునొప్పులు, స్వల్ప జ్వరం, అలసట, గొంతులో దురదతో బాధపడుతున్నారు. టీకాలు తీసుకోని వారిలో తలనొప్పి, ఒళ్లు నొప్పులు విపరీతంగా ఉంటున్నాయి. కానీ, కొందరు బాధితుల్లో మాత్రం అసాధారణ లక్షణాలు కన్పిస్తున్నాయి. అవి డెల్టా కంటే పూర్తి భిన్నంగా ఉన్నాయి."
-డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ, దక్షిణాఫ్రికా వైద్యురాలు
Omicron variant effect: "ఒమిక్రాన్ వేరియంట్ సోకిన బాధితులకు అలసట, బలహీనతతో పాటు రాత్రిపూట విపరీతమైన చెమటలు పడుతున్నాయి. ఎంతలా అంటే ఈ చెమట కారణంగా వారి దుస్తులు, బెడ్ కూడా తడిసిపోతున్నట్లు వారు చెబుతున్నారు. చాలా మందిలో ఈ లక్షణం కన్పిస్తోంది" అని ఏంజెలిక్ వివరించారు. ఇక గొంతు గరగర కూడా ఎక్కువగా ఉంటోందన్నారు. అయితే డెల్టా సోకిన వారు వాసన కోల్పోగా.. ఒమిక్రాన్ సోకిన బాధితుల్లో ఆ లక్షణం కన్పించట్లేదని తెలిపారు.
ఇదీ చూడండి: 'ఒమిక్రాన్‌తో జాగ్రత్త.. మరణాలు పెరుగుతాయి!'
South afirc varinat: ఒమిక్రాన్ వేరియంట్ తొలిసారిగా దక్షిణాఫ్రికాలో బయటపడింది. ఈ వేరియంట్ బాధితులకు చికిత్స అందిస్తున్న వారిలో డాక్టర్ ఏంజెలిక్ కూడా ఒకరు. తన వద్దకు వస్తున్న పేషెంట్ల లక్షణాలను బట్టి ఈ నిర్ధారణకు వచ్చినట్లు ఆ డాక్టర్ తెలిపారు. అయితే మందులతో ఈ వేరియంట్ నుంచి కోలుకుంటున్నట్లు చెప్పారు. ఈ లక్షణాలు కన్పించినవారు వెంటనే కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆమె ఈ సందర్భంగా సూచించారు.
ఇవీ చూడండి: