ETV Bharat / international

సోమాలియాలో ఆత్మాహుతి దాడి- 26 మంది మృతి - ఆత్మాహుతి

దక్షిణ సోమాలియాలోని ఓ హోటల్​ వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు ఉగ్రవాదులు. పర్యటకులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సుమారు 26 మంది మరణించారు. మృతుల్లో పలువురు విదేశీయులు. దాడికి పాల్పడింది తామేనని ఆల్​-షబాబ్​ ఉగ్రసంస్థ ప్రకటించింది.

సోమాలియాలో ఆత్మాహుతి దాడి- 26 మంది మృతి
author img

By

Published : Jul 13, 2019, 5:29 PM IST

దక్షిణ సోమాలియాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ ప్రముఖ హోటల్​పై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. పర్యటకులు, స్థానికులే లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సుమారు 26 మంది మరణించారు.

కారులో పేలుడు పదార్థాలను నింపుకుని వచ్చిన ఉగ్రవాది కిస్మయో నగరంలోని మెదినా హోటల్​ వద్ద ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు కొద్ది సమయం ముందు పలువురు సాయుధ ఉగ్రవాదులు హోటల్​లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. పోలీసుల దుస్తులు ధరించిన ఉగ్రవాదులు హోటల్​లోకి ప్రవేశించినట్లు క్షతగాత్రులు చెప్పారు.

సమాచారం అందుకున్న భద్రత దళాలు ఘటనా స్థలానికి చేరుకుని ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ముష్కరులు, బలగాల మధ్య సుమారు 12 గంటల పాటు భీకర పోరు జరిగింది.

హోటల్​పై దాడి చేసింది తామేనని ఆల్​-షబాబ్​ ఉగ్రసంస్థ ప్రకటించింది.

మృతుల్లో విదేశీయులు...

మృతుల్లో ముగ్గురు కెన్యా, ముగ్గురు టాంజానియా, ఇద్దరు అమెరికా, ఒకరు బ్రిటన్​కు చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరు చైనీయులు తీవ్రంగా గాయపడ్డారు.

మధ్య, దక్షిణ సోమాలియాలో ఆల్​-షబాబ్​ ఉగ్రసంస్థ అధిపత్యం చలాయిస్తోంది. ఈ సంస్థలో సుమారు 9 వేల మంది వరకు ఉన్నట్లు అంచనా. 2010లో ఆల్​ఖైదాతో జట్టుకట్టింది.

ఇదీ చూడండి: బాలుడ్ని రేప్​ చేసిన టీచరమ్మకు 20ఏళ్ల జైలు

RESTRICTION SUMMARY: NO ACCESS IRAQ/NO ARCHIVE/DO NOT OBSCURE LOGO
SHOTLIST:
RUDAW TV - NO ACCESS IRAQ/NO ARCHIVE/DO NOT OBSCURE LOGO
Irbil - 13 July 2019
1. Wide of fire burning in market in front of Justice Tower with smoke billowing
2. Helicopter dropping water onto fire
3. Helicopter collecting water to drop on to fire
4. Helicopter carrying water to fire and dropping on target
5. Various of smoke billowing from market fire
STORYLINE:
A fire broke out on Saturday in a local market in Irbil.
Emergency services have yet to bring the fire under control.
Irbil-based Kurdish broadcaster, Rudaw TV, aired pictures of rescue workers using a helicopter to drop water onto the fire from above.
The cause of the fire that started in front of Justice Tower is not yet known.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.