ఆఫ్రికా దేశం సెనెగల్‌లో రాజకీయ పరిణామాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. దేశాధ్యక్షుడు మాకీ సాల్, పాలనా సంస్కరణల్లో భాగంగా ప్రధానమంత్రి పదవి రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ప్రస్తుత ప్రధాని మహమ్మద్ బౌన్ అబ్దుల్లా డియోన్నే స్వయంగా డకార్‌లోని అధ్యక్ష భవనం నుంచి ప్రకటించారు.
పాలనను ప్రజలకు చేరువ చేయడమే ఈ సంస్కరణల ముఖ్యోద్దేశమని డియోన్నే తెలిపారు.
ఇటీవలే అధ్యక్షుడు సాల్ తన అనుయాయుడైన డియోన్నేకు మరోసారి ప్రధాని పదవి కట్టబెట్టారు. తాజాగా ప్రధాని పదవి రద్దు చేయాలని నిర్ణయించడం వల్ల... అధ్యక్ష శాసనం అనుసరించి ఇకపై డియోన్నే సెక్రటరీ జనరల్ ఆఫ్ రిపబ్లిక్‌గా కొనసాగనున్నారు.
గెలిచిన వారానికే...
ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాకీ సాల్ భారీ విజయం సాధించి, రెండోసారి అధ్యక్ష పీఠం అధిరోహించారు. వెంటనే రాజకీయ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.