ETV Bharat / international

భారతీయ టీకాలను పొరుగు దేశాలకు అమ్మేసిన దక్షిణాఫ్రికా - దక్షిణాఫ్రికాలో కరోనా వైరస్

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్​ డోసులను సొంత ప్రజలకు అందించకుండా, పొరుగు దేశాలకు విక్రయించింది దక్షిణాఫ్రికా. కరోనా కొత్త వేరియంట్​పై ప్రభావం చూపట్లేదన్న కారణంగా ఆ దేశ ప్రభుత్వం ఈ టీకాల పంపిణీని నిలిపివేసింది.

SA
'భారత్​ నుంచి కొన్న టీకాల విక్రయం పూర్తయింది'
author img

By

Published : Mar 22, 2021, 11:50 AM IST

భారత్​ నుంచి కొనుగోలు చేసిన 10 లక్షల ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ డోసులను పొరుగు దేశాలకు విక్రయించింది దక్షిణాఫ్రికా. ఈమేరకు ఆదివారం వెల్లడించారు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి జ్వేలి మఖాయిజ్.

"ఆఫ్రికా సమాఖ్యలో టీకా కొనుగోలుకు సిద్ధమైన 14 దేశాలకు వ్యాక్సిన్లను విక్రయించడం పూర్తయింది. వ్యాక్సిన్​ పంపిణీకి కావాల్సిన అన్ని అనుమతులు ఆ దేశాలు పొందాయి. ఇందుకు సంబంధించిన డబ్బు గత సోమవారమే మాకు అందింది. ప్రస్తుతం 9 దేశాలకు పంపిణీ ప్రారంభించాము. త్వరలోనే మిగతా 5 దేశాలకు వ్యాక్సిన్లు అందిస్తాము."

-జ్వేలి మఖాయిజ్, దక్షిణాఫ్రికా ఆరోగ్యశాఖ మంత్రి

దక్షిణాఫ్రికా వేరియంట్​పై ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్​ ప్రభావం చూపదన్న కారణంతో ఆ దేశ ప్రభుత్వం టీకా పంపిణీని నిలిపివేసింది. ఈ వినియోగించని డోసులను ఇతర దేశాలకు విక్రయించింది. ఆ స్థానంలో ప్రత్యామ్నాయంగా ఇతర వ్యాక్సిన్లను పంపిణీ చేస్తోంది.

ఇదీ చదవండి : భారత్​ నుంచి లండన్ పరారైన నేరగాళ్లపై పుస్తకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.