ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ సౌజన్యంతో భారత్ సీరం సంస్థ తయారు చేస్తున్న కరోనా టీకా డోసులను దక్షిణాఫ్రికాకు సరఫరా చేయనున్నట్లు తెలుస్తోంది. రెండు దశల్లో 15 లక్షల డోసులను భారత్ పంపిణీ చేయనున్నట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రి జ్వేలి ఎమ్ఖైజ్ వెల్లడించారు. జనవరిలో 10 లక్షల డోసులు.. ఫిబ్రవరిలో అదనంగా 5 లక్షల వ్యాక్సిన్లు సీరం అందిస్తోందని పేర్కొన్నారు.
దేశంలో ఆరోగ్య పరిస్థితులపై పార్లమెంటు పోర్ట్‌ఫోలియో కమిటీని ఉద్దేశించి మాట్లాడిని ఆయన.. దిగుమతి చేసుకున్న టీకాలను ముందుగా ఫ్రంట్‌లైన్ వైద్య సిబ్బందికి వేస్తామని వెల్లడించారు.
సమయానికి చెల్లింపులు చేయడంలో నిర్లక్ష్యం వల్లే టీకాలు సేకరించడంలో విఫలమైనట్లు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత్ టీకాలు అందిస్తోందని ప్రకటించారు ఎమ్ఖైజ్. భారత టీకా సరఫరా గురించి ఇంకా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
ఇదీ చూడండి: హత్య కేసులో ట్రంప్‌పై అరెస్ట్ వారెంట్