మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా దక్షిణాఫ్రికా, డర్బన్‌లోని ఫీనిక్స్ సెటిల్‌మెంట్‌ను జాతీయ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం. ఈ ప్రకటనను స్వాగతించారు భారత హైకమిషనర్ జైదీప్ సర్కార్.
అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించింది దక్షిణాఫ్రికా.
ఫీనిక్స్‌లో మహత్మా గాంధీ ఒక ఆశ్రమాన్ని స్థాపించారు. సత్యాగ్రహంతో తన ప్రయోగాలను ప్రారంభించి తన వార్తాపత్రిక 'ఇండియన్ ఒపీనియన్'ను సెటిల్మెంట్ నుంచే ప్రచురించేవారు. కాబట్టి ఈ స్థలాన్ని గాంధీ ఆలోచనలకు నెలవుగా ప్రకటించింది దక్షిణాఫ్రికా ప్రభుత్వం.
"ఈ ప్రకటన భారత్-దక్షిణాఫ్రికా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. ఆ ప్రదేశాన్ని సంరక్షించడం వల్ల గాంధీ వారసత్వం, ఆలోచనలు, విలువలను కూడా కాపాడుకున్నట్లు అవుతుంది. భవిష్యత్ తరాలకు కూడా స్ఫూర్తినిస్తుంది."
-దక్షిణాఫ్రికా ప్రభుత్వం.
ఇదీ చదవండి: 'నవాజ్‌ను తిరిగి రప్పించే ప్లాన్ వేయండి!'