ETV Bharat / international

ఆ దేశంలో ట్విట్టర్​పై సస్పెన్షన్ వేటు

ఆఫ్రికాలోని నైజీరియా సర్కారు ట్విట్టర్​పై సస్పెన్షన్ వేటు విధించింది. ఆ దేశ అధ్యక్షుడు ట్వీట్​ను తొలగించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.

author img

By

Published : Jun 5, 2021, 8:44 AM IST

twitter, nigeria
ట్విటర్, నైజీరియా ట్విటర్

మైక్రోబ్లాగింగ్ ప్లాట్​ఫార్మ్ ట్విట్టర్​ను సస్పెండ్​ చేసినట్లు నైజీరియా ప్రభుత్వం ప్రకటించింది. ఆ దేశ అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ చేసిన ట్వీట్​ను సామాజిక మాధ్యమం డిలీట్ చేసిన కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలోని వేర్పాటువాద ఉద్యమాన్ని ఉద్దేశించి బుహారీ వివాదాస్పద ట్వీట్ చేశారు.

అయితే.. ఈ నిర్ణయాన్ని ట్విట్టర్​ వేదికగానే ప్రకటించిన కారణంగా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ట్విటర్​ను సస్పెండ్​ చేస్తున్నామని ట్విటర్​లోనే చెప్పడమేంటని కొందరు అన్నారు. మరికొందరు వీపీఎన్​ ద్వారా ఈ మాధ్యమాన్ని వినియోగిస్తామని, ప్రభుత్వం నిర్ణయంతో తమకు పనిలేదని అంటున్నారు. నైజీరియా సర్కారు ట్విట్టర్​​పై కీలక ప్రకటన చేసినప్పటికీ శుక్రవారం అర్ధరాత్రి వరకు వినియోగదారులు తమ ఖాతాను ఉపయోగించుకున్నారు.

బుహారీ పోస్ట్​ను డిలీట్ చేసిన కారణంగా ట్విటర్​ను రద్దు చేస్తున్నట్లు సమాచార శాఖ మంత్రి లాయి మహమ్మద్ తెలిపారు. నైజీరియా ప్రభుత్వ శక్తిని కించపరిచేందుకు కొందరు ఈ మాధ్యమాన్ని ఉపయోగిస్తున్నారని విమర్శించారు. గతంలోనూ ప్రభుత్వ వ్యతిరేక ట్వీట్​లపై ట్విట్టర్ నిర్లక్ష్యం వహించిందని పేర్కొన్నారు.

దేశంలోని ఆగ్నేయం ప్రాంతంలో నివసించే కొంతమందిని ఉగ్రవాదులుగా భావిస్తున్నట్లు బుహారీ ట్వీట్ చేశారు. దీన్ని వివాదాస్పద ట్వీట్​గా భావించిన ట్విటర్​ బుధవారం దాన్ని తొలగించింది.

ఇదీ చదవండి:మారిషస్‌ మాజీ అధ్యక్షుడు కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.