కాంగోలో ఘోర పడవ ప్రమాదం(Congo Boat Accident) జరిగింది. ఈ ఘటనలో 100 మందికి పైగా మృతి మృతి చెందడమో, గల్లంతవడమో జరిగిందని అధికారులు శనివారం తెలిపారు. గత సోమవారం రాత్రి మొంగాలాలోని బుంబా పట్టణానికి సమీపంలో కాంగో నదిలో ఈ దుర్ఘటన(Congo Boat Accident) జరిగిందని చెప్పారు.
ఒకదానికి మరొకటి కలిపి ఉన్న 9 పడవలు సామర్థ్యానికి మించి ప్రయాణికులతో వెళ్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రమాదవశాత్తూ పడవలు బోల్తా పడ్డాయని చెప్పారు. ఈ ఘటనలో ఇప్పటిదాకా 61 మృతదేహాలు లభ్యమయ్యాయని మొంగాలా రాష్ట్ర రవాణా మంత్రి జోస్ మిసిసో వెల్లడించారు. చిన్నారులు, మహిళలు సహా 100 మందికి పైగా గల్లంతైనట్లు చెప్పారు. 30 మందిని రక్షించినట్లు పేర్కొన్నారు.
కాంగోలో పడవ ప్రమాదాలు(Congo Boat Accident) తరుచూ జరుగుతుంటాయి. సామర్థ్యానికి మించి నదిలో పడవలు ప్రయాణించడమే ఇందుకు ప్రధాన కారణం. కాంగోలో రోడ్డు సదుపాయం సరిగా లేకపోవడం వల్ల చాలా మంది.. నదీ మార్గాలను ఆశ్రయిస్తారు.
ఇదీ చూడండి: Plane Crash: కూలిన ఎయిర్ ఫోర్స్ విమానం- ఆరుగురు మృతి
ఇదీ చూడండి: కరోనాకు 6 లక్షల మంది బలి.. మృతులకు వినూత్న నివాళి