ETV Bharat / international

ఒకే వ్యక్తిని పెళ్లాడిన ముగ్గురు కవలలు- లవ్​ స్టోరీలో ట్విస్టులే ట్విస్టులు! - congo marriage news

Man Marries Identical Triplets: ఓ వ్యక్తి ఒకే రోజు ముగ్గురు కవలలను(ట్రిప్లెట్స్​) పెళ్లిచేసుకొని ఇటీవల వార్తల్లోకెక్కాడు. జీవితంలో అన్నీ సమానంగా పంచుకునే కాంగోలోని ఆ ట్రిప్లెట్స్​.. భర్తగా ఒకే వ్యక్తిని ఎంచుకున్నారు. ఒకరినే ప్రేమించి పెళ్లిపీటలెక్కారు. అయితే.. ఈ కథలో ఎన్నో ట్విస్టులున్నాయి. ఆ వ్యక్తి ప్రేమించింది ఒక్కరినే అయినా.. ముగ్గురిని చేసుకోవాల్సి వచ్చింది. ఎలాగంటే?

Man Marries Identical Triplets
Man Marries Identical Triplets
author img

By

Published : Mar 9, 2022, 2:26 PM IST

Man Marries Identical Triplets: కాంగోకు చెందిన 32 ఏళ్ల వ్యక్తి లువిజో.. ఒకేరోజు ఒకేసారి ముగ్గురు కవలలను పెళ్లాడాడు. వైభవంగా జరిగిన ఆ వివాహవేడుక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే.. ఇక్కడే మంచి ట్విస్టులున్నాయి కథలో. లువిజో ప్రేమించింది మాత్రం ఒకరినే. చివరికి ముగ్గురిని పెళ్లిచేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు కథ ఇదీ..

లువిజోకు సోషల్​ మీడియా ద్వారా పరిచయమైంది నటాలీ. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇలా ప్రేమలో ఉన్న ఇరువురూ తరచూ కలుస్తుండేవారు. అప్పుడే తొలి షాక్​ తగిలిందతనికి. నటాలీతో పాటు.. అచ్చం ఆమెలానే ఉండే మరో ఇద్దరిని కలిశానన్న విషయం అతడికి తెలిసేందుకు చాలా సమయమే పట్టింది. ఒకేలా ఉన్నారు కాబట్టి.. అతడూ గుర్తించలేకపోయాడు. నటాలీతో పాటు.. నటాషా, నడెగేతో ప్రేమలో పడిపోయాడు. వారంతా ఒకరోజు ఒకేసారి వచ్చి.. ముగ్గురం ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని అసలు విషయం చెప్పారు. ఇది విని లువిజో తొలుత ఆశ్చర్యపోయినప్పటికీ.. వారి మాటను కాదనలేకపోయాడు.

Man Marries Identical Triplets Who Didnt Want to Get Separated
ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన లువిజో

''అసలు విషయం తెలిసి నేను షాక్ అయ్యా. ముగ్గురూ ఒకేసారి వచ్చినప్పుడు నేను అడిగా 'మీలో నటాలీ ఎవరని?' కానీ వేర్వేరు సందర్భాల్లో వారందరినీ కలిశానని చెప్పారు. ఏం చేయాలో నాకు తెలియలేదు. నేను నటాలీనే పెళ్లి చేసుకోవాలనుకున్నా. కానీ.. ఒక్కరినే పెళ్లి చేసుకొని.. మిగతా ఇద్దరిని వదిలేయలేను.''

- లువిజో

''మేం ముగ్గురం అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని చెప్పినప్పుడు.. అతడు మొదట షాకయ్యాడు. కానీ.. అప్పటికే మా అందరితో ప్రేమలో పడిపోయినందున మా ప్లాన్ విఫలం కాలేదు. మేం కూడా అతడితో ప్రేమలోనే ఉన్నాం కాబట్టి ఏం కాలేదు.''

- నటాలీ

ముగ్గురు మహిళలు ఒకే వ్యక్తిని భర్తగా చేసుకోవడం అసాధ్యమని ప్రజలు భావించినప్పటికీ.. ప్రతిదీ పంచుకోవడం చిన్నప్పటి నుంచే అలవాటయ్యిందని చెబుతోంది నటాలీ.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ముగ్గురిని పెళ్లిచేసుకోవాలని లువిజో నిర్ణయించుకున్నప్పటికీ.. అది అతడి కుటుంబసభ్యులకు నచ్చలేదు. పెళ్లికి కూడా హాజరుకాలేదు. లువిజో సోదరీమణులు మాత్రం అతడిని అర్థం చేసుకొని మద్దతుగా నిలిచారు.

ఇవీ చూడండి: ఎనిమిది మంది భార్యల ముద్దుల మొగుడు- ఒకే ఇంట్లో ఖుషీగా కాపురం!

ఇద్దరు మహిళా డాక్టర్ల ప్రేమాయణం..!

బరాత్​లో కారుపైకి ఎక్కి స్టెప్పులేసిన పెళ్లి కూతురు.. వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.