పశ్చిమ ఆఫ్రికా సెంట్రల్ మాలీలోని బిడి, సంకారో,సరన్ గ్రామాలపై దుండగులు దాడి చేశారు. 23 మందిని ఊచకోత కోశారు. అర్ధరాత్రి వేళ అందరూ నిద్రిస్తున్న సమయంలో కొంతమంది సాయుధకారులు ఈ దారుణానికి ఒడిగట్టారు. పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయని, ప్రజల రక్షణకు భద్రతా సిబ్బంది భరోసానివ్వడం అత్యవసరమని స్థానిక మేయర్ తెలిపారు.
మరో ఘటనలో కోరో సెంట్రల్ పట్టణం సమీపంలో పేలుడు సంభవించి 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
తెగల మధ్య ఘర్షణలు...
2015 లో బోధకుడు అమోడౌ కౌఫా నేతృత్వంలో జీహాదీ సమూహం ఉద్భవించినప్పటి నుంచి దేశంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పులాని, డోగోన్, బంబార తెగల మధ్య కొన్నేళ్లుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హత్యలు చోటుచేసుకుంటున్నాయి.
ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం గత మార్చిలో పులాని తెగకు చెందిన 160 మందిపై ప్రత్యర్ధి సాయుధబలగాలు నరమేధం సృష్టించారు. జూన్ 17న డోగోన్ తెగకు చెందిన రెండు గ్రామాల్లోని 41 మంది దారుణ హత్యకు గురయ్యారు.
ఫ్రాన్స్, ఐక్యరాజ్యసమితి నుండి భద్రతా సహాయం పొందినప్పటికీ... జీహాదీలు మాలీ ప్రభుత్వానికి సమస్యలు సృష్టిస్తున్నారు.
ఇదీ చూడండి: