ఆఫ్రికా దేశాలను అతలాకుతలం చేసిన ఇదాయ్ తుపాను ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని జింబాబ్వే ప్రకటించింది. శుక్రవారం తుపాను ఆ దేశాలను చిన్నాభిన్నం చేసింది. ఇదాయ్ ధాటికి జింబాబ్వేలోఇప్పటి వరకు100 మంది మృతిచెందారు. ఈ సంఖ్య 300కు చేరుకునే అవకాశం ఉందని వెల్లడించింది ప్రభుత్వం.
"మృతుల సంఖ్య వందగా నిర్ధరించాం. మృతులు 300 అని కొన్ని వర్గాలంటున్నాయి. కానీ ప్రస్తుతం మేము దీనిని ధ్రువీకరించలేం. నీళ్లలో మృతుదేహాలు ఇంకా కొట్టుకువస్తున్నాయి. వరద ప్రవాహంలో కొన్ని మొజాంబిక్‌కు చేరాయని అనుమానిస్తున్నాం" -జులై మోయో, జింబాబ్వే మంత్రి
తుపాను కారణంగా ఇప్పటివరకు 217మంది గల్లంతయ్యారు. 44 మంది వరదల్లో చిక్కుకున్నారు. తూర్పు జింబాబ్వేలోని చిమానిమని పట్టణంలో ఇదాయ్ ప్రభావం ఎక్కువగా ఉంది.