నైజీరియాలో ఓ పాఠశాలపై దాడి చేసి 30 మంది విద్యార్థులను అపహరించారు ముష్కరులు. వారిలో విద్యార్థులు సహా పలువురు సిబ్బంది కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కదునా రాష్ట్రం ఇగాబిలోని ఫేడరల్ కాలేజ్ ఆఫ్ ఫారెస్టరీ మెకనైజింగ్ విద్యా సంస్థలో గురువారం రాత్రి జరిగిందీ ఘటన.
ముష్కరులతో చర్చలు జరిపి 180 మంది విద్యార్థులు, సిబ్బందిని సురక్షితంగా రక్షించామని అధికారులు పేర్కొన్నారు. అయితే ఉగ్రవాదుల దాడిలో పలువురు గాయపడినట్లు పేర్కొన్నారు. అదృశ్యమైన విద్యార్థుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: క్వాడ్ సదస్సుపై తీవ్రంగా స్పందించిన చైనా