నైజీరియా ఎనుగు రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు అదుపు తప్పి స్కూలు బస్సుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటన 21 మంది చిన్నారులు మరణించారు. దీనిపై దేశ అధ్యక్షుడు ముహమ్మద్ బుహారీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
బ్రేకులు విఫలమవడం వల్ల ట్రక్కు అదుపు తప్పి.. 61 మంది చిన్నారులు ప్రయాణిస్తున్న బస్సుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మృతి చెందిన వారందరూ... నర్సరీ, ప్రాథమిక పాఠశాల విద్యార్థులు అధికారులు గుర్తించారు. మరణించినవారిలో ఓ ఉపాధ్యాయుడు కూడా ఉన్నట్లు సమాచారం.
ఇదీ చూడండి: టర్కీ, గ్రీస్‌లో భారీ భూకంపం.. 12 మంది మృతి