ప్రపంచ మానవాళిపై కరోనా ఉగ్రరూపం చూపుతోంది. వైరస్ వ్యాపించిన వారి సంఖ్య తాజాగా రెండు కోట్లకు చేరింది. 7.33 లక్షల మంది ఈ మహమ్మారికి బలయ్యారు. ఇప్పటివరకు 1.29 కోట్లమంది వైరస్ నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 64 లక్షల యాక్టివ్ కేసులున్నాయి.
ఆఫ్రికాలో కరోనా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. ఇందులో సగానికిపైగా ఒక్క దక్షిణాఫ్రికా నుంచే ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో కరోనా మరణాల సంఖ్య 10 లక్షలు మార్క్ దాటిపోయింది.
బ్రిటన్లో మరోసారి కరోనా ప్రబలుతోంది. రోజువారీగా నమోదయ్యే కేసుల సంఖ్య జూన్ నెల తర్వాత తొలిసారి వెయ్యి దాటింది.
అమెరికాలో మరో 47 వేలకుపైగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. కేసుల సంఖ్య 52 లక్షలకు ఎగబాకింది. 534 మంది మరణంతో మొత్తం మృతుల సంఖ్య 1,65,617కు చేరింది. మరోవైపు, మెక్సికోలో మరణాల సంఖ్య 50 వేలు దాటింది.
వివిధ దేశాల్లో కరోనా కేసుల వివరాలు ఇలా...
దేశం | కేసులు | మరణాలు |
అమెరికా | 51,99,444 | 1,65,617 |
బ్రెజిల్ | 30,35,582 | 1,01,136 |
రష్యా | 8,87,536 | 14,931 |
దక్షిణాఫ్రికా | 5,59,859 | 10,408 |
పెరూ | 4,78,024 | 21,072 |
మెక్సికో | 4,75,902 | 52,006 |
ఇదీ చదవండి: మహాత్ముడి కళ్లజోడు వేలం.. ఎంత పలికిందంటే?