నైజీరియా, లాగోస్ నగరంలోని 21 అంతస్తుల భవనం కూలిపోయిన ఘటనలో (building collapse today) మృతుల సంఖ్య 20కి చేరింది. 9మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల్లో ఇంకా చాలా మంది ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
![building collapse latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13534869_img1-2.jpg)
లాగోస్ నగరంలో 21 అంతస్తుల భవన నిర్మాణం గత ఏడాదిగా జరుగుతోంది. కూలీలు పనిలో నిమగ్నమై ఉండగా భవనం సోమవారం ఒక్కసారిగా కుప్పకూలింది. అధిక సంఖ్యలో కూలీలు ప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
![building collapse latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13534869_img1-3.jpg)
![building collapse latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13534869_img1-1.jpg)
ఇదీ చదవండి: ఇథియోపియాలో జాతీయ అత్యయిక స్థితి