ETV Bharat / international

టునీసియాలో లోయలో పడిన బస్సు.. 22 మంది మృతి

టునీసియాలో పర్యటక బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు.

author img

By

Published : Dec 2, 2019, 8:35 AM IST

Updated : Dec 2, 2019, 9:52 AM IST

Bus accident kills 22 in northern Tunisia
తునీసియాలో లోయలో పడిన బస్సు

టునీసియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యటకులతో వెళ్తోన్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

దేశ రాజధాని టునీస్​ నుంచి ఐన్​ద్రాహం వైపు బస్సు వెళుతున్న క్రమంలో ఐన్​స్నౌసీ ప్రాంతంలో కొండపైనుంచి లోయలోకి దూసుకెళ్లింది బస్సు. ఈ ఘటనలో బస్సు నుజ్జునుజ్జయింది. బస్సులో ఉన్న వారంతా టునీసియన్లేనని గుర్తించారు అధికారులు.

టునీసియాలో లోయలో పడిన బస్సు

ప్రపంచంలోనే రోడ్డు ప్రమాదాల రేటు అధికంగా ఉన్న దేశం టునీసియా అని 2015లోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) హెచ్చరించింది. తుపాకీ మోతలతో దద్దరిల్లే లిబియా కన్నా ముందు టునీసియా ఉన్నట్లు పేర్కొంది. అస్తవ్యస్త రోడ్లు, నిర్లక్ష్యపు డ్రైవింగ్​, పాడైపోయిన వాహనాలతోనే అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణులు వెల్లడించారు.

ఇదీ చూడండి: సిరియా ఘర్షణల్లో 2 రోజుల్లోనే 70 మంది మృతి

New Delhi, Dec 02 (ANI): Slogan of 'Sonia Gandhi zindabad! Congress party zindabad! Rahul Gandhi zindabad! Priyanka Chopra zindabad!', instead of Priyanka Gandhi Vadra was mistakenly raised by Congress' Surender Kumar at a public rally in Delhi. Delhi Congress chief Subhash Chopra was also present in the rally.
Last Updated : Dec 2, 2019, 9:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.