ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో(burkina faso violence) జరిగిన దాడిలో 19 మంది మరణించారు. వీరిలో తొమ్మిది మంది భద్రతా సిబ్బంది సహా.. 10మంది పౌరులు ఉన్నట్లు ప్రభుత్వ మీడియా పేర్కొప్రెస్ ఏజెన్సీ తెలిపింది. సెంటర్ నార్త్ రీజియన్‌లోని ఫౌబ్‌లో జరిగిన ఈ దాడిలో 'డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్'(doctor without borders) అనే సంస్థ ఆసుపత్రిని ముష్కరులు తగలబెట్టగా.. పలువురు సిబ్బంది గాయపడ్డారు. 'ఈ వార్తతో షాక్ అయ్యాం.. ఈ భీకర పరిస్థితికి ఆందోళన చెందాం' అని డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ మిషన్ హెడ్ మమడౌ డయారా వ్యాఖ్యానించారు.
"ఈ దాడితో ఆరోగ్య కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. ఇకపై రోగులకు ఇక్కడ చికిత్స అందించలేం. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు."
--మమడౌ డయారా, డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ మిషన్
అల్-ఖైదా-ఇస్లామిక్ స్టేట్ మధ్య ఘర్షణల కారణంగా బుర్కినా ఫాసోలో రోజురోజుకి హింస(burkina faso attack) పెరుగుతోంది. దీనితో వేలాది మంది అమాయక పౌరులు(burkina faso religion) మరణిస్తున్నారు. 14 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఈ నెల ఆరంభంలో సహెల్స్ సౌమ్ ప్రావిన్స్‌లో జరిగిన హింసలోనూ 50 మందికి పైగా మరణించారు. అయితే.. ప్రస్తుత భీకరకాండకు వందల కిలోమీటర్ల దూరంలోని 'జెండార్మ్ సైనిక చెక్‌పోస్ట్' లక్ష్యంగా ఈ దాడి జరిగి ఉండొచ్చని సైన్యం అనుమానిస్తోంది.
మరోవైపు.. దేశంలోని హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రజాసంఘాలు ఆరోపించాయి. దేశాధ్యక్షుడు రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోర్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నవంబర్ 27న నిరసనలకు పిలుపునిచ్చాయి.
'అధ్యక్షుడు రాజీనామా చేస్తే, మరో వ్యక్తి ఈ సమస్యను పరిష్కరించగలరని భావిస్తున్నాం. ఎందుకంటే అధ్యక్షుడే ప్రధాన సమస్య' సివిల్ సొసైటీ గ్రూప్ అధ్యక్షుడు మమడౌ డ్రాబో స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: