బాంబు పేలుడుతో సోమాలియా రాజధాని మొగదిషు ఉలిక్కిపడింది. నగరంలోని ఓ ఐస్‌క్రీమ్ పార్లర్‌పై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు ముష్కరులు. ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
సోమాలియాలోని అగ్రరాజ్య దౌత్యవేత్త, మిలిటరీ అధికారులను కలిసేందుకు శుక్రవారం.. మొగదిషులో పర్యటించారు అమెరికా రక్షణ శాఖ తాత్కాలిక మంత్రి క్రిస్టోపర్ మిల్లర్. ఆయన నగరం నుంచి వెళ్లిన కొద్ది సమయంలోనే ఆత్మాహుతి దాడి జరిగటం గమనార్హం.
ఈ ఘటనకు ఆల్‌ఖైదా అనుబంధ సంస్థ ఆల్ సబాబ్ ఉగ్రసంస్థ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటన చేసింది.
ఇదీ చూడండి:'ఉగ్రవాదంపై భారత్‌తో కలిసి పోరాటం'