ఉత్తర నైజీరియాలోని కట్సినా రాష్ట్రంలోని పలు గ్రామాల్లో బందిపోట్లు మారణహోమం సృష్టించారు. ఈ దాడుల్లో 47 మంది మృతి చెందారు.
కట్సినాలోని దట్సేన్మా, డాన్ముసా, సఫానా జిల్లాల్లోని గ్రామాలపై ప్రణాళికాబద్ధంగా బందిపోట్లు విరుచుకుపడినట్లు తెలిపారు పోలీసులు. ద్విచక్రవాహనాలపై వచ్చి తుపాకులతో గ్రామస్థులను కాల్చి చంపినట్లు వెల్లడించారు.
బందిపోట్ల దాడులు జరిగిన ప్రాంతాల్లో భారీ ఎత్తున భద్రతా దళాల్ని మోహరించింది నైజీరియా ప్రభుత్వం.
ఇదీ చదవండి: కరోనా పరీక్షల్లో భారత్కు, అమెరికాకు ఇంత తేడానా?