ఆఫ్రికా నైజీరియాలోని కదునా రాష్ట్రంలో బందిపోట్లు శుక్రవారం ఉదయం మారణహోమం సృష్టించారు. రెండు గ్రామాలపై కాల్పులు జరిపి.. 10 మందిని హత్య చేశారు. ఈ ఘటనల్లో అనేక మంది గాయాలపాలయ్యారు.
యాగ్బాక్, ఉంగ్వాన్ రుహుగో గ్రామాలపై దుండగులు కాల్పులకు తెగబడ్డారని కుదునా రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అనేక మంది గాయపడ్డారని... పలు ఇళ్లు ధ్వంసమయ్యాయని చెప్పింది. ఆయా గ్రామాల్లో భద్రతా దళాలను మోహరించినట్లు పేర్కొంది.
మోటార్‌బైక్‌లపై వచ్చి
మోటార్‌బైక్‌లపై వచ్చిన సాయుధులు ఈ దాడులకు పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. పలు ఇళ్లకు నిప్పంటించారని చెప్పారు. మరోవైపు.. ఈ దాడులపై దర్యాప్తునకు ఆదేశించినట్లు కుదునా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. బాధితులకు సహాయక సామగ్రిని అందిస్తున్నట్లు చెప్పింది.
నైజీరియాలోని ఉత్తర ప్రాంతంలో కొద్ది నెలలుగా వరుసగా ఇలాంటి సాయుధుల దాడులు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో అనేక మంది అపహరణకు, హత్యకు గురవుతున్నారు.
ఇదీ చూడండి: పాక్‌లో భారీగా పెరిగిన పెట్రోల్ ధర- అయినా చక్కెరకన్నా చౌకే!